ఖనిలో సదర్​ ఉత్సవాలు అభినందనీయం : గడ్డం వంశీకృష్ణ

  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు : యాదవుల అభివృద్ధికి ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో ఆదివారం రాత్రి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు మేకల శ్రీధర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్​ ఉత్సవానికి ఎంపీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. గోదావరిఖనిలో తొలిసారిగా సదర్​ఉత్సవం నిర్వహించిన యాదవ సమాజాన్ని ఆయన అభినందించారు. 

అనంతరం దున్నమెడలో పూలదండ వేశారు.  ఉత్సవంలో నాలుగు దున్నలు కవాత్​ చేస్తూ ఉత్సాహపరిచాయి. కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్, యాదవ సంఘం నేషనల్​ ఆర్గనైజింగ్​సెక్రటరీ మహేంద్రనాథ్​యాదవ్​, అయిలయ్యయాదవ్​, సదానందం, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.