కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుంది : ఎంపీ వంశీకృష్ణ

 కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే కులగణన చేపట్టిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబి గెస్ట్ హౌస్ లో  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి కులగణనపై సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడిన  ఎంపీ  వంశీకృష్ణ..   రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా   కులగణన  సమావేశాలు చేపట్టిందన్నారు.   కులగణనలో అన్ని వర్గాల వాళ్లు పాల్గొని  బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.  దేశంలోనే  కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందన్నారు వంశీకృష్ణ.   

పేద, బలహీన వర్గాలు ఎదగడానికి కులగణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు ఎమ్మెల్యే మక్కాన్  సింగ్ రాజ్ ఠాకూర్.  70 శాతం  ఉన్న బలహీన వర్గాల వారు  సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుల గణన ఉపయోగపడుతుందన్నారు.