ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోంది : ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌‌‌‌లో ఫండ్స్‌‌‌‌ కేటాయించినట్లు చెప్పారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఉంటుందన్నారు.

ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు స్మారకార్థం త్వరలో తెలంగాణ స్థాయి టోర్నీని నిర్వహిస్తామన్నారు. జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, ఏఎంసి చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డివైఎస్ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్, లీడర్లు సాయిరి మహేందర్‌‌‌‌‌‌‌‌, అబ్బయ్య గౌడ్, కృష్ణ, కిశోర్‌‌‌‌‌‌‌‌, పెద్దన్న, తిరుపతి పాల్గొన్నారు.  

మల్యాల, వెలుగు: మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల గ్రౌండ్‌‌‌‌లో బుధవారం మండలస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇవాళ బాలికలు, గురువారం బాలురకు పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో జయసింహారావు తెలిపారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ మునీందర్, ఎంపీడీవో స్వాతి, కాంగ్రెస్ లీడర్లు ఆనంద రెడ్డి, ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సతీశ్​రెడ్డి, వంశీ పాల్గొన్నారు.