ఎల్లమ్మ పట్నాల్లో ఎమ్మెల్యే పూజలు 

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామాల్లో బుధవారం రేణుక ఎల్లమ్మతల్లి పట్నాలు ఘనంగా నిర్వహించారు. గౌడ కుటుంబాలకు చెందిన పలువురు తమ ఆరాధ్య  దైవం రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గౌడ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.