పెద్దపల్లిలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియంత్రణకు చర్యలు : కలెక్టర్​ శ్రీహర్ష

పెద్దపల్లి, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్​ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏసీపీలు జి.కృష్ణ, ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  జిల్లా ఎక్సైజ్​అధికారి  మహిపాల్ రెడ్డి,  డీఈవో డి.మాధవి, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు శివయ్య, రౌఫ్ ఖాన్, డీఐఈఓ కల్పన పాల్గొన్నారు.