రోడ్లపై గుంతలు పూడ్చేయాలి : కలెక్టర్  శ్రీహర్ష

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతలను ఈనెల 9 లోపు పూడ్చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్​ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలోని శాలపల్లి రోడ్డు, బస్టాండ్, కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై గుంతలను వెట్ మిక్స్, డస్ట్ తో పూడ్చివేయాలని, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కడా రోడ్లపై గుంతలు కనిపించొద్దన్నారు.

స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నీటి వనరుల పరిశుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కార్పొరేషన్​ పరిధిలో 300 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని లైబ్రరీని సందర్శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ శ్రీకాంత్, అధికారులు ఉన్నారు.