ఎల్లంపల్లి భూ నిర్వాసితులను బీఆర్ఎస్ ఎప్పుడు పట్టించుకోలేదు:ఎంపీ వంశీకృష్ణ

పదేళ్లలో బీఆర్ ఎస్ పార్టీ ఏనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గురువారం ( నవంబర్ 7) ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. 

రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెగ్యాం గ్రామస్తులు భూములు ఇచ్చి ఎంతో త్యాగం చేశారని కొనయాడారు. ఎల్లంపల్లి భూనిర్వాసితులకు  పరిహారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. 

Also Read : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో 7లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా కూడా ప్రజల సంక్షేమమే ఆలోచిస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.