ఫిట్​నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్​ చేయాలి

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఫిట్ నెస్ లేకుండా నడుస్తున్న స్కూల్​ బస్సులను సీజ్ చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం ఆర్మూర్​ ఎంవీఐ వివేకాంద్ రెడ్డికి వినతి ప్రతం ఇచ్చారు. ఈసందర్భంగా  పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్

మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో సీట్లకు మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారని చెప్పారు. వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.