మెండోరా మండలంలో పీడీఎస్ బియ్యం సీజ్

బాల్కొండ, వెలుగు :  అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం రాత్రి అధికారులు సీజ్​ చేశారు. మెండోరా ఎస్ఐ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.  మెండోరా మండలంలోని కోడిచర్ల వద్ద ఆటోను తనిఖీ చేయగా పీడీఎస్​ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.