Paytm Money: యాప్ కొత్త ఫీచర్..స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లోన్

Paytm Money యాప్ కొత్త ఫీచర్ పేలేటర్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ(MTF) ను ప్రారంభించింది.ఇది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.. స్టాక్ లను ట్రేడ్ చేయడానికి ముందస్తు పెట్టుబడి అందిస్తుంది. ఈ ఫెసిలిటీతో Paytm Money  ప్లాట్ ఫాం ద్వారా స్టాక్ లను కొనుగోలు చేయడం ఈజీ అవుతుంది.  కొనుగోలు కావాల్సిన అమౌంట్ కొంత చెల్లించి స్టాక్ లను కొనుగోలు చేయొచ్చు. మిగతా అమౌంట్ ను Paytm Money  చెల్లిస్తుంది. ఈ ఫెసిలిటీతో ప్రారంభ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. నెలకు1శాతం నామమాత్రపు వడ్డీతో పెట్టుబడి అందిస్తుంది. మార్చి 31,2025 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. దాదాపు 1000 స్టాక్ లను ఎంచుకోవచ్చు. 

Paytm Money Paylater యాక్టివేషన్.. 

Paylater ఆప్షన్ యాక్టివేషన్ ప్రక్రియ చాలా ఈజీ.. ఇది అందరికి సుళభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది. యాప్ సెట్టింగ్ లలోకి వెళ్లి  క్షణాల్లో యాక్టవేట్ చేసుకోవచ్చు. Margin ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా అవసరమైన స్టాక్స్ ను ఆర్డర్ చేయొచ్చు. 

ఈ ఫెసిలిటీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది. ఇది ముందస్తుగా పెద్దమొత్తంగా పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. 

ALSO READ | AI News : చాట్ జీపీటీకి 15 వేల మిలియన్ యూరోల జరిమానా వేసిన ఇటలీ ప్రభుత్వం

వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేటీఎసం మనీ యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, ఫెసిలిటీలను అందిస్తుంది.. ఇటీవల లేటెస్ట్ ఇంటర ఫేస్, పర్సనలైజ్ డ్ డ్యాష్ బోర్డు, స్మార్టర్ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. 

ఈ రీవ్యాంపుడ్ యాప్ తో..స్టాక్స్, F&O ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మరింత సులభతరం చేయడం , పోర్ట్ ఫోలియో అభివృద్ది, ట్రాన్స్జాక్షన్  ఫ్లోలను మెరుగుపర్చడం వంటి అవసరాలను తీర్చే లక్ష్యంగా పెట్టుకుంది.