Paytm షాక్ : రాజీనామా చేసి వెళ్లిపోండి.. గుక్కపెట్టి ఏడ్చిన ఉద్యోగులు

Paytm షాక్ ఇచ్చింది. ఉద్యోగులను తీసి వేస్తుంది. అప్పటికప్పుడు చెప్పటంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు ఎంప్లాయిస్.. జూన్ నెలలో జీతాలు తీసుకున్న చాలా మంది ఉద్యోగులను పిలిచిన యాజమాన్యం.. మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి.. ఇప్పటికిప్పుడే ఆఫీసుల నుంచి వెళ్లిపోండి.. మీకు రావాల్సిన బకాయిలు అన్నీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.. మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పటంతో.. ఉద్యోగులు గుక్కపెట్టిన ఏడ్చారు. ఉన్నటు ఉండి ఉద్యోగాలు తీసివేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పేటీఎంలో ఉద్యోగుల తొలగింపు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పేటీఎం బ్యాంక్స్ పై ఇండియాలో ఆర్బీఐ బ్యాంక్ ఆంక్షలు విధించిన, ఆ సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆ కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఉద్యోగులను తీసివేయడమే కాదు.. ఆఫర్ లెటర్ ఇచ్చిన  వారిని కూడా వెనక్కు పంపిస్తోంది పేటీఎం. అంతేకాదు ఎంప్లాయిస్ కు ఇచ్చిన బోనస్ తిరిగి కంపెనీ వసూలు చేసింది. ఇంత గడ్డు పరిస్థితిలో పేటీఎం కంపెనీ ఉంది. ఉద్యోగుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.. ఎడుపొక్కటే తక్కువైంది వాళ్లకు. గత ఆరు నెలల నుంచి పేటీఎంలో విపరీతంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. భయం గుప్పిట్లో ఉద్యోగస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

పెరుగుతున్న నష్టాలను నిర్వహించడానికి పేటీఎం సుమారు 5,000 నుంచి 6,300 మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులకు తగ్గించడం ద్వారా రూ. 400-500 కోట్లను ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలపై RBI విధించిన నిషేధంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది.

ఫైనాషలియర్ 23లో కంపెనీ సగటున 32,798 మంది ఉద్యోగులను పేరోల్‌లో కలిగి ఉంది. అందులో 29,503 మంది యాక్టివ్‌ గా పని చేస్తున్నారు. ఒక ఉద్యోగికి సగటు జీతం రూ.7.87 లక్షలు. FY24 కోసం మొత్తం ఉద్యోగి ఖర్చులు సంవత్సరానికి 34 శాతం పెరిగి రూ. 3,124 కోట్లకు చేరాయి. ఒక్కో ఉద్యోగి సగటు ఖర్చు రూ. 10.6 లక్షలకు పెరిగింది. ఇప్పటికే డిసెంబర్‌లో 1,000 మంది ఉద్యోగులను తొలగించారు. FY24లో తొలగించే ఉద్యోగుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఇది 20శాతంగా ఉండొచ్చని ప్రముఖ బిజినెస్ అనాలసిస్ట్స్ అంటున్నారు.