మా ఫ్యామిలీతో మేడారంకు రావడం ఇది ఎనిమిదోసారి. గతంలో మహాజాతర టైంలోనే వచ్చేటోళ్లం. అప్పుడు బాగా రద్దీగా ఉండటం వల్ల తల్లుల దర్శనానికి చాలా లేట్ అయ్యేది. క్యూలైన్లలో పిల్లలు తెగ ఇబ్బందిపడేవారు. ఈ సారి మహాజాతర కంటే మూడు వారాల ముందుగానే వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించినం.
ముందస్తు మొక్కుల కోసం పిల్లాపాపలతో కలిసి 20 మందిదాకా వచ్చినం. అయినా చాలా ఫ్రీగా అమ్మల దర్శన భాగ్యం మాకు కలిగింది. పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నరు. మేడారంలో గతంలో కంటే ఇప్పుడు ఏర్పాట్లు మస్తున్నయ్. కాకపోతే భక్తులు రెండురోజులు ఉండే విధంగా సర్కారు తరపున సత్రాలు నిర్మిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.
పస్తం మంజయ్య ఫ్యామిలీపటాన్‌చెరు, హైదరాబాద్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి