చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ క్రైం,వెలుగు : కొత్తగా పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగంలో చేరుతున్న కానిస్టేబుళ్లు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ లోని రాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీస్​ శిక్షణ కాలేజీ(పీటీసీ)లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసుకున్న 1102 మంది సివిల్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుళ్లకు గురువారం అవుట్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. నిస్వార్థంగా, నిజాయితీతో పనిచేసినప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. శిక్షణలో ప్రతిభ కనపరచిన కానిస్టేబుళ్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతీక పోలీసు ఉద్యోగం

కరీంనగర్ సిటీ, వెలుగు : పోలీస్ ఉద్యోగం అంటేనే త్యాగాలతో కూడుకున్నదని, కొత్తగా పోలీస్‌‌‌‌‌‌‌‌శాఖలో జాయిన్​అవుతున్న కానిస్టేబుళ్లు నిజాయితీతో, అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి.కమలాసన్ రెడ్డి సూచించారు. కరీంనగర్  సిటీ ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌కి చెందిన 248 మంది ఏఆర్​కానిస్టేబుళ్లు బేసిక్​ఇండక్షన్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసుకోగా.. గురువారం అవుట్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా వీబీ కమలాసన్ రెడ్డి,  కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి హాజరై గౌరవ వందనం స్వీకరించారు. 

ఈ సందర్భంగా డీజీ, సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగంలో నిత్యం సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు నిత్యం సిద్ధంగా ఉండాలన్నారు. శిక్షణలో అద్భుత ప్రతిభ కనబరిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. అవుట్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌కు కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో సీటీసీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్, ఏసీపీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.