ఇవాళ (డిసెంబర్ 25) నుంచి పార్లమెంట్ సమావేశాలు

  • డిసెంబర్​ 20 వరకు కొనసాగనున్న సెషన్
  • వాడివేడిగా సాగిన ఆల్​పార్టీ మీటింగ్​
  • అదానీ, మణిపూర్​పై చర్చకు కాంగ్రెస్ పట్టు
  • అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం
  • ఈ సెషన్​లో సభల ముందుకు 16 బిల్లులు

న్యూఢిల్లీ, వెలుగు : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి.  డిసెంబర్ 20 వరకు సెషన్స్​ కొనసాగనున్నాయి. సెలవులు తీసివేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం ఆల్​పార్టీ మీటింగ్​ ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌‌‌‌‌‌‌‌లతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా.. 

కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, గౌరవ్ గగోయి, కె.సురేశ్, జేడీ (యూ) నుంచి ఉపేంద్ర కుష్వాహా, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, వైసీపీ నుంచి విజయ సాయిరెడ్డి, టీడీపీ, ఎస్పీ, బీజేడీ, ఎండీఎంకే ప్రతినిధులు అటెండ్​ అయ్యారు. 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు పాల్గొన్నారు.  ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై అమెరికా మోపిన లంచం ఆరోపణలు, మణిపూర్​ అల్లర్లు, తదితర విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పట్టుబట్టింది. 

అలాగే, కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై కూడా డిస్కస్ చేయాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ మీడియాకు తెలిపారు. బిజినెస్ ను పక్కనపెట్టి తాము డిమాండ్ చేస్తున్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్​ పై చర్చ జరపాలని స్పష్టం చేశామన్నారు. 

విభజన చట్టంపై చర్చకు  బీఆర్ఎస్, టీడీపీ డిమాండ్​

ఏపీ విభజన చట్టంలోని అంశాలు, తెలంగాణలో అమృత్ స్కీమ్​లో కాంట్రాక్ట్ కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. అలాగే, ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు సైతం విజభజ చట్టంలోని హామీల అంశాన్ని ఆల్ పార్టీ మీటింగ్ దృష్టికి తెచ్చాయి.  అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని, సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. 

కాగా, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ హాల్ లో సంవిధాన్ సదన్ నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ నెల 29 న తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించే చాన్స్​ ఉన్నది. 

ఉభయ సభల ముందుకు 16 బిల్లులు 

ఈ సెషన్స్​లో దాదాపు 16 బిల్లులను ఉభయ సభల ముందుకు కేంద్రం తీసుకురానున్నది.  కొత్తగా రాష్ట్రీయ స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌కార విశ్వవిద్యాల‌‌‌‌‌‌‌‌యం ఏర్పాటు బిల్లు, పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియ‌‌‌‌‌‌‌‌న్ పోర్ట్​ బిల్లు, జేపీసీ రిపోర్టు ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెట్టనున్నారు. ఇక లోక్‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెట్టి, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బిల్లు ల్లో విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్విభజన బిల్లు, ముస్లిం వక్ఫ్ (రీపీల్‌‌‌‌‌‌‌‌) బిల్లు, ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, స‌‌‌‌‌‌‌‌ముద్రం నుంచి వ‌‌‌‌‌‌‌‌స్తువులు తీసుకొచ్చే బిల్లు, రైల్వేస్ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు ఉన్నాయి. 

లోక్‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ఆమోదం పొంది రాజ్యస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బిల్లుల్లో భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు పై చర్చ జరగనుంది. దీనికి తోడు రాజ్యస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెట్టి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ముఖ్య బిల్లుల్లో... చమురు క్షేత్రాల (నియంత్రణ అండ్ అభివృద్ధి) సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లులు కీలకంగా ఉన్నాయి. కాగా, కీలకమైన ‘వన్ నేషన్- –వన్ ఎలక్షన్’ బిల్లును ఈ సెషన్ లోనే ప్రవేశపెట్టే చాన్స్​ ఉన్నదని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు సివిల్ కోడ్ బిల్లు కూడా చర్చకు రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.