జగిత్యాల బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరేషాన్​

  • బస్సులు నిలిచే ప్రాంతంలోనే టూ వీలర్ పార్కింగ్

జగిత్యాల, వెలుగు : జగిత్యాల బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యగా మారింది. బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దనే టూవీలర్లు నిలుపుతుండడంతో బస్సుల రాకపోకలతోపాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాగా గతంలో టూ వీలర్స్ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని లీజుకు ఇవ్వడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

పార్కింగ్ స్థలాన్ని మార్చడంతోనే..

గతం లో జగిత్యాల బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆనుకొని కొత్త బస్టాండ్ చౌరస్తా వైపు ఉన్న స్థలంలో టూ వీలర్ పార్కింగ్ కేటాయించారు. అయితే ఆ స్థలాన్ని ఆరేళ్ల కింద మరొకరికి లీజుకు ఇవ్వడంతో టూ వీలర్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇన్ గేట్, అవుట్ గేట్ మధ్యలోని స్థలాన్ని కేటాయించారు. దీని పక్కనే కార్గో కొరియర్​సర్వీస్, టాయిలెట్స్ కూడా ఉండటం, ఇక్కడే ఆగిన బస్సుల్లోని ప్రయాణికులు దిగడంతో సమస్య తలెత్తుతోంది. 

గతంలో ప్రైవేట్ వాహనాలు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవడంతో కొంతవరకు తీవ్రత తగ్గినా, బస్టాండ్ లోపల పార్కింగ్ ఏర్పాటు చేయడంతో టూవీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేయలేని పరిస్థితి. దీనిపై జగిత్యాల డీఎం సునీత మాట్లాడుతూ కొత్త బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టూ వీలర్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు తలెత్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తికాగానే పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేరే చోటుకు తరలించాలని ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.