ఫస్ట్ టైం ఎప్పుడు పంచెకట్టావ్? అని అడిగితే చిన్నప్పుడు ఎప్పుడో పంచెల ఫంక్షన్ చేసినప్పుడు అంటారు చాలామంది. మరి రెండోసారి... అంటే ఆలోచించాల్సిందే అంటారు. ఎందుకంటే లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ లో, అది కూడా కాస్త బలవంతంగానే పంచెకట్టులో కనిపిస్తారు మగవాళ్లు, అది కూడా పెళ్లి, పండుగో, వ్రతమో... వాటి ముహూర్తం టైం ముగిసేంత వరకే, తర్వాత చకచకా డ్రెస్ మార్చేసి జీన్స్ ప్యాంట్ వేయాల్సిందే. 'కొత్తబట్టలు అప్పుడే తీసేశావేంటి?' అని ఎవరైనా అడిగితే 'అమ్మో.... రోజంతా ఆ పంచెని క్యారీ చేయడం నా వల్ల కాదు' అనేస్తారు. కానీ... ధోతీ మ్యాన్ కట్టిన ధోతీ స్టిల్స్ చూస్తే "ధోతీ వద్దు, జీన్స్ ముద్దు" అనేవాళ్ల మైండ్ సెట్ మారిపోవడం ఖాయం.
ఈ గోతిమ్యాన్ పేరు ప్రఫుల్. పుట్టింది కానీ, ముంబైలో పెరిగాడు. ఏడేండ్ల వయసు ఉన్నప్పటి నుంచే ధోతీ కట్టుకోవడమంటే ఇష్టం. "కానీ, ధోతిలంటే ఇంట్లోవాళ్లకి నచ్చదు. కానీ, నేనెప్పుడూ పంచెలు కట్టుకుంటా. స్కూల్ లాస్ట్ ఫంక్షని తర్వాత గ్రాడ్యుయేషన్ డే రోజున ధోతీ కట్టుకున్నా. నేను గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఫ్యాషన్ కాలేజ్ లోనే. రెగ్యులర్ అయితే మామూలు బట్టలే వేసుకుంటా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా పంచె కట్టుకుంటా” అంటున్నాడు ప్రఫుల్,
ధోతీలు పెద్దవాళ్లకే కాదు...
చిన్నప్పటి నుంచి తనకి ఫ్యాషన్ మీద ఉన్న ప్యాషన్ తో దుబాయ్ వెళ్లి ఫ్యాషన్ కంపెనీల్లో దాదాపు ఇరవైయేళ్లు పనిచేశాడు. పోయినేడాది గోవాలో ఆర్గానిక్ క్లోతింగ్ బ్రాండ్గా పేరున్న 'సెపియా స్టోరీస్'ని ప్రారంభించాడు. మూడేళ్ల కిందట తన మేనల్లుడు 'ధోతీలు ముసలి వాళ్లు మాత్రమే కట్టుకుంటారు' అని అన్నాడట. దాంతో ప్రఫుల్ కి ఒక ఐడియా వచ్చింది. సొసైటీలో చాలామంది తన మేనల్లుడిలానే అనుకుంటున్నారు. కానీ, మన దేశంలో పంచెకట్టుకు ఉన్న ప్రాధాన్యం ఎవరికీ తెలియదు. ధోతి కట్టుకోవడం వెనక ఉన్న స్టోరీలూ తెలియదు. అలాంటి వాళ్లందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇండియాలో ఉన్న వేల రకాల ధోతీల కథలు చెప్పాలనుకున్నాడు.
ధోతీలు, వాటి రకాలు, అవి కట్టుకునే స్టయిల్స్ గురించి ఒక బుక్ రాయాలనుకున్నాడు ప్రఫుల్. కానీ, అదంతా తను రాసి, ప్రజలు దాన్ని చదివి తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది అనిపించింది. ఫాస్ట్ జనాల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడానికి ఇంకేం చేయొచ్చు? అని చాలా రోజులు ఆలోచించాడు. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. ధోతీల మీద ఒక డాక్యుమెంటరీ తీసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే తర్వగా రీచ్ అవుతుందని అనుకున్నాడు.
పది రాష్ట్రాల్లో రీసెర్చ్..
అనుకున్నదే తడవుగా రకరకాల ధోతీలు కట్టుకుని, వెరైటీ వెరైటీ పోజుల్లో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఫొటోలతో పాటు ప్రతి ధోతీ స్టయిల్, దాని వివరాలు రాశాడు. అయితే ఈయన కట్టుకునే ధోతీలు మాత్రమే స్పెషల్ కాదు. దానికి తగ్గట్టు వేసుకునే బూట్లు, చెప్పులు కూడా ప్రత్యేకమే. ఎందుకంటే వేసుకునే బట్టలు, కట్టుకునే పంచె వాటి క్లాత్ ను బట్టి చెప్పులు కూడా సూట్ అయ్యేలా వేసుకోవడమే ప్రఫుల్ స్పెషాలిటీ. అంతేకాదు, వెరైటీ ధోనీ ఫ్యాషన్లు కోసం పది రాష్ట్రాల్లో రీసెర్చ్ చేశాడట. వాటిలో ఒక్క మహారాష్ట్రలోనే పది రకాల ఫ్యాషన్లున్నాయి. తమిళనాడులో కాంచీపురంలో తయారయ్యే సిల్క్ ధోతీలంటే ప్రఫులికి చాలా ఇష్టమట. ఇంకా చత్తీస్ గఢ్ కుమ్మరులు, రైతులు కట్టుకునే రోతీ స్టయిల్స్, బంగ్లాదేశ్ వాళ్ల లుంగీ స్టయిల్, గుజరాత్, బెంగాల్, అసోం, ఒడిశా వంటి రాష్ట్రాల వారి స్టయిల్స్ మీద రీసెర్చ్ చేశాడు.
లేటెస్ట్ ఫ్యాషన్..
'పంచెకట్టు అంటే అంత నీరసం వచ్చేస్తుంది. ఎందుకు కొందరికి ? అది కూడా ఒక ఫ్యాషనే కదా. షర్ట్, టీషర్ట్, కుర్తా దేనిమీదికైనా పసూట్ అవుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాల వెరైటీల్లో పంచెకట్టుకోవచ్చు. దీన్నే రోతీ ఫ్యాషన్ అంటారు. ధోతీలు ముసలివాళ్లు లేదా ఫలానా కులం వాళ్లు కట్టుకుంటారనే ఆలోచన మానేయాలి. అలా ఆలోచించారంటే ఫ్యాషన్ ప్రపంచంలో ఒక మంచి టెడిషనల్ స్టయిల్ ను మిస్ అయినట్టే. ఎందుకంటే ఇదీ ఒక ఫ్యాషనే' అంటాడు ప్రఫుల్ మక్వానా.