PAN 2.0: పాత పాన్ కార్డులు చెల్లుతాయా?..పాన్ 2.0 కార్డులతో ఉపయోగం..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..

పాన్ కార్డు..మీ ఆదాయాన్ని గుర్తింపు, ట్యాక్స్ పేమెంట్స్, బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా..పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. మరోవైపు షేర్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయాలన్ని, అమ్మాలన్నా, కారు కొనుగోలు , ఇంటి కొనుగోలు వంటి పెద్ద పెద్ద లావాదేవీలకు పాన్ కార్డు తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డును ఐడెంటిటీ కోసం కూడా వినియోగించవచ్చు. గతంలో మనకు పాన్ కార్డు 1.0 ఉండేది.. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా పాన్ కార్డు 2.0ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో పాత కార్డు అంటే పాన్ కార్డు 1.0 ను ఉపయోగించవచ్చా.. దాని వ్యాలిడిటీ,  కొత్త కార్డు ఎలా పొందాలి,ఉపయోగాలు, కార్డు ధర ఎంత ఇలా అనేక సందేహాలున్నాయి.. వీటిపై కేంద్రం ప్రభుత్వం క్లారిటి ఇచ్చింది. 

PAN 2.0  పాన్ కార్డును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే..పాన్ 2.0 కార్డు ప్రారంభం తర్వాత ట్యాక్స్ పేయర్లలో అనేక సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఉన్న పాన్ కార్డు పనిచేస్తుందా..ఎప్పటివరకు పనిచేస్తుంది..కొత్త కార్డు తీసుకోవాలంటే ఎంత చెల్లించాలి..కొత్త ఫీచర్లు ఏంటీ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

PAN 2.0లో డైనమిక్ ఫీచర్ QR Code.. 

కొత్తగా వచ్చిన PAN 2.0 కార్డులో డైనమిక్ ఫీచర్ QR Code. ఇది 2017-నుంచి ఉన్నప్పటికీ ఈ కొత్త వెర్షన్ లో అనేక రియల్ టైట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎక్కువ డేటా ,ప్రామాణికతను అందిస్తాయి. ఇంతకుముందు పాన్ కార్డు 1.0 ఉన్నవారు కూడా ఈ అప్డేట్ లకోసం పాన్ 2.0 ను తీసుకోవచ్చు. 

ఏంటీ PAN 2.0 ప్రాజెక్టు.. 

సమగ్ర ఈ గవర్నెన్స్ లక్ష్యంగా PAN 2.0 ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. 
ట్యాక్స్ పేయర్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా చేయడం.. 
ఫాస్ట్, సమర్థవంతమైన సేవలకు 
కంప్లయింట్స్ పరిష్కార విధానాలను బలోపేతం చేయడం 
డేటా ప్రొటెక్షన్,సెక్యూరిటీని మెరుగుపర్చడం
కస్టమర్ అనుభవాన్ని క్రమబద్ధీకరించడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి PAN , TANలతో  ఆదాయపు పన్ను శాఖ (ITD) పని చేస్తోంది.

కొత్త కార్డు (PAN 2.0) పొందాలంటే డబ్బులు చెల్లించాలా?

PAN 2.0 స్కీం కింద పాత కార్డు హోల్డర్లు అప్లయ్ చేసుకోవాల్సిన అవసరంలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాత పాన్ కార్డులు(PAN 1.0) ఎప్పటికీ పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. వీకర్స్ సెక్షన్లకు చెందిన ట్యాక్స్ పేయర్లకు ఆర్థిక భారం ఉండదు. 
PAN 2.0 స్కీం కింద కొత్త పాన్ కార్డులు పొందాలన్నా, అప్డేట్ లవంటి డిజిటల్ సేవలు ఉచితం. అయితే అప్‌గ్రేడ్ పాన్ కార్డ్ ఫిజికల్ కార్డు పొందాలనుకుంటే మాత్రం నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పాన్ కేటాయింపులు మరియు అప్‌డేట్‌లతో సహా డిజిటల్ సేవలు ఉచితంగా అందించబడతాయి.
నవంబర్ 25న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) పాన్ 2.0ను ఆమోదించింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1,435 కోట్లను కేటాయించింది. ప్రస్తుత పాన్/టాన్ సిస్టమ్‌ను మెరుగు పర్చడం, పనితీరు, పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుత పాన్ హోల్డర్‌లకు ఎటువంటి ఇబ్బంది లేదు

పాత పాన్ కార్డులు ఉన్నవారికి PAN 2.0 తో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుత కార్డు హోల్డర్లు అప్ గ్రేడ్ చేసిన వెర్షన్ కు మారాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నొక్కి చెప్పింది.పాత కార్డు హోల్డర్లకు అదనపు ఖర్చులు ఏకుండా పాన్ 2.0ని సేవలు అందించబడతాయి. పాన్ 2.0 స్కీంతో ట్యాక్స్ పేయర్లకు అతుకులేని , మరిన్ని సౌకర్యాలను అందించబడతాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.