నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు.. కలకలం రేపుతున్న కరపత్రాలు

జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పంపీణీ చేసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు అంటూ పాంప్లెట్లను న్యూస్ పేపర్లలో పెట్టి పంపిణీ చేశారు. ఈ కరపత్రాలపై ప్రింటర్ పేరు, నేతల హోదాలు లేవు. దీంతో పలు అనుమానాలకు తావిస్తుంది.

ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ వారు కరపత్రాలను పంపిణీ చేశారా?.. లేదంటే, బీజేపీ నేతలే ఆయనపై అసహనంతో పంపిణీ చేయించారా ? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.