పాక్​లో టెర్రర్ అటాక్.. 16 మంది జవాన్ల మృతి

పెషావర్: పాకిస్తాన్​లో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్​లోని సెక్యూరిటీ చెక్ పోస్టుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.  అఫ్గాన్ బార్డర్​ మకీన్​లోని లిటా సర్​లో ఉన్న చెక్ పోస్టుపై దాడిచేశారు. ఈ ఘటనలో16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో భద్రతాబలగాలపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది.