విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

వర్ని, వెలుగు: రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మార్కెట్‌‌ కమిటీ రీజినల్‌‌ డైరెక్టర్‌‌‌‌ పద్మహర్ష హెచ్చరించారు. వర్ని మార్కెట్‌‌ కమిటీని సోమవారం ఆమె‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌‌ కమిటీకి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించారు. మార్కెట్‌‌ కమిటీ సెక్రటరీ, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,మార్కెట్‌‌ కమిటీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని కొందరు రైతులు ఆఫీసర్‌‌ దృష్టికి తీసుకొచ్చారు.