నందిపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

​నందిపేట, వెలుగు : నందిపేట మండలం అయిలాపూర్, చింరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సొసైటీల పరిధిలోని గ్రామాల్లో ఆయా సొసైటీల చైర్మన్లు మీసాల సుదర్శన్​, గంగారెడ్డి శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.

కొనుగోలు సెంటర్లలోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు మహిపాల్, సొసైటీ డైరెక్టర్లు, సెక్రటరీలు, రైతులు పాల్గొన్నారు.