అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని శెట్పల్లి, పర్మల్ల, ఎక్కపల్లి, సజ్జన్​పల్లి గ్రామాల్లో  గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో  కొనుగోలు కేంద్రాల్లో  రైతులు ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది.

 అకస్మాత్తుగా ఈదురు గాలులతో  కూడిన వాన కురవడంతో కల్లాల్లో వరదలు పారాయి.  ఎండిన వడ్లు సైతం తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.