వరి పంట నాటేశారా.. జింక్ లోపం నివారణకు చర్యలు ఇవే...

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వరి పంట నాట్లు వేస్తున్నారు.  చాలా గ్రామాల్లో ఇప్పటికే  పూర్తి కూడా అయింది.    ప్రారంభమయ్యింది. దాదాపు అన్ని పంట పిలకలు దశలో ఉంది. అయితే అధిక శాతం నేలల్లో జింక్ లోపం ఉండటం చేత, వరి పంట పిలక దశలో తెగుళ్ల బారిన పడుతుంది.  వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు జింక్ లోపం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. . . . 

ALSO READ | వావ్​ .. ఐడియా అదిరింది... తోలు బొమ్మతో కోతుల నుంచి పంటను కాపాడాడు..

వరి పంటలో జింక్ లోపం  ఎక్కువుగా గుర్తించినట్లయితే  వరి నారుమడి మరియు పిలకలు దశలో ఇనుపదాతు మరియు జింక్ లోపించి మొక్క సరిగా ఎదగదు.  వరినాట్లు నాటిన 2 నుంచి 4 వారాల్లో ఈ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. జింక్ లోపం ద్వారా ముదురాకు మధ్య, మరియు చివర్లలో ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. జింక్ లోపం ఎక్కువుగా ఉన్నట్లైతే మొక్కల్లో పై నుంచి 3 నుంచి 4 ఆకుల మధ్య ఈనె పాలిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆకులు చిన్నవిగా ,పెళుసుగా మారుతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు.

నేల తత్వాన్ని బట్టి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు తలెత్తుతాయి. క్షౌర నేలలు, సున్నం అధికంగా ఉన్న నేలలు మరియు పొలంలో ఎక్కువ కాలం నీరు నిలిచిపోయినప్పుడు ఇనుపధాతు లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా భాస్వరం ఎరువులు ఎక్కువుగా వాడే నేలల్లో కూడా ఇనుపధాతు లోపం ఎక్కువుగా కనబడుతుంది. దానితోపాటుగా, నల్ల రేగడి నేలలు, క్షారభూములు, సున్నం అధికంగా ఉన్న నేలలు మరియు మురుగు నీరు నిలిచిపోయే నేలల్లో జింక్ దాతు లోపం కనబడుతుంది.

జింక్ ధాతు లోపాన్ని నివారించడానికి, ఏడాదికి మూడు వరి పంటలు పండించేవారు ఒకసారి, రెండు పంటలు పండించేవారు, ప్రతి రబీ సీజన్లో, ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి కలియ దున్నాలి. పంట ఎదిగే సమయంలో జింక్ లోపం కనిపించినట్లైతే, లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, పై పూతగా మొక్కలపై పిచికారీ చెయ్యాలి. జింక్ లోపాన్ని అశ్రద్ధ చేస్తే దిగుబడి 10శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.  కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. జింక్ లోపం కనిపించిన వెంటనే జింక్ సల్ఫేట్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి, ఇలా 2నుంచి 3 సార్లు చెయ్యడం ద్వారా మొక్కకు అవసరమైన జింక్ అదించవచ్చు. చౌడు నేలల్లో సాగు చేసేవారు పంట ఆఖరి దుక్కిలో తప్పకుండ జింక్ సల్ఫేట్ కలపాలి.