టైటిల్ : కాలింగ్ సహస్ర
డైరెక్షన్ : అరుణ్ విక్కిరాల
కాస్ట్ : సుడిగాలి సుధీర్, డాలీషా, స్పందన, శివ బాలాజీ, మనోహరన్, రవితేజ
లాంగ్వేజి : తెలుగు
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
అజయ్ శ్రీ వాత్సవ (సుడిగాలి సుధీర్) సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. హైదరాబాద్‌లోని తన ఫ్రెండ్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. తన అక్క హత్య తాలూకు చేదు జ్ఞాపకాలు అతడిని వెంటాడుతుంటాయి. మరే అమ్మాయికీ తన అక్కలా అన్యాయం జరగకూడదని ‘రెస్క్యూ’ అనే అప్లికేషన్ తయారుచేస్తాడు. ఒకరోజు అజయ్ కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటాడు. అది తన మొబైల్ ఫోన్లో వేసుకున్నప్పటి నుంచీ వరుస ఫోన్లు వస్తుంటాయి.
ఆ ఫోన్ కాల్స్ చేసిన వాళ్లంతా సహస్ర గురించి ఆరా తీస్తుంటారు. దాంతో అజయ్ అయోమయానికి గురవుతాడు. అసలు సహస్ర ఎవరు? ఆమెకు ఏమైంది? అజయ్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? సారా పేరుతో అజయ్‌కు లేఖలు రాస్తున్న అజ్ఞాత ప్రేమికురాలు, సహస్ర ఒకరేనా?
అజయ్ అక్క చావుకు, సహస్ర కనిపించకుండా పోవడానికి ఏమైనా లింక్ ఉందా? ఈ మొత్తం కథకు, లూసిఫర్ అనే డార్క్ వెబ్ సైట్ క్రైమ్ ముఠాకు సంబంధం ఉందా? ఇందులో శివ (శివ బాలాజీ )పాత్ర ప్రాముఖ్యత ఏంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
యు ఆర్ వాట్ యు ఈట్
టైటిల్ : యు ఆర్ వాట్ యు ఈట్ - ఎ ట్విన్ ఎక్స్పరిమెంట్
డైరెక్షన్ : లూయీ సిహోయోస్
లాంగ్వేజి : ఇంగ్లిష్
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
ఈ డాక్యు సిరీస్ కొత్త ఏడాదికి మంచి బిగినింగ్ అని చెప్పొచ్చు. అది కూడా హెల్త్ మొదటి ప్రయారిటీ అయి ఉంటే ‘యు ఆర్ వాట్ యు ఈట్’ను ఇంకాస్త ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంది.
నాలుగు పార్ట్‌ల ఈ సిరీస్‌లో 22 కవల జంటలు పార్టిసిపేట్ చేశాయి. వాళ్లు తినే ఆహారంలో మార్పులు చేసి వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందనేది సైంటిఫిక్‌గా గమనించారు. మొదటి ఎపిసోడ్లో సోషల్ ఎక్స్పరిమెంట్ అనే కాన్సెప్ట్, పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈ ఎక్స్పరిమెంట్లో పాల్గొన్న కవల జంటల బ్యాక్గ్రౌండ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్లలో ఒక జంటకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్(శాఖాహారం) ఇస్తే మరొక జంటలకు ఓమ్నివోర్ డైట్(శాఖాహారం, మాంసాహారం) ఇచ్చారు. వాళ్లు ఈ డైట్ ప్లాన్‌ను ఎనిమిది వారాలు ఫాలో అయ్యాయి. మొదటి వారం మాత్రం వాళ్లు ఏం తిన్నారో ఆ ఫుడ్ వివరాలు రీసెర్చర్లకు మెయిల్ చేశారు. ఆ వివరాలతో పాటు స్టాండర్డ్ అమెరికన్ డైట్ అనేది వాడుకలోకి ఎలా వచ్చింది? తక్కువ ధరతో ఉండే ఫుడ్, ఎక్కువ కాలరీలు తినడం అనేది రోజూ తినే నార్మల్ డైట్‌గా ఎందుకు మారింది? వంటి వివరాలను ఈ ఎపిసోడ్లో చూపించారు.
రెండో ఎపిసోడ్లో ... డైట్ ప్లాన్స్ ఫాలో కావడానికి ఆ రెండు కవల జంటలు ఎంత కష్టపడుతున్నాయనేది చూపించారు. అలాగే ఆయా ప్రాంతాల వాతావరణ ప్రభావం అనేది ఆ ప్రాంతంలో నివసించే మనుషులు ఎంచుకునే ఆహారం మీద ఎంతవరకు పడుతుంది అనేది కూడా వివరించారు. ‘ఏం తింటున్నారనే కాదు. ఆ ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుందనేది కూడా తెలుసుకోవాలి’ అనే విషయం మీద ఈ డాక్యుసిరీస్ గట్టిగా చెప్పింది. లైవ్‌స్టాక్ నుంచి పౌల్ట్రీ, ఫిష్ ఫార్మింగ్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చూపించారు. గ్లోబల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇండస్ట్రీ కంటే లైవ్‌స్టాక్ వల్ల గ్రీన్హౌస్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుందనే విషయాన్ని ఎక్స్పర్ట్స్ మాట్లాడారు.
మూడో ఎపిసోడ్లో.. వీగన్ డైట్ చేస్తున్న కవలలు వాళ్ల ఫుడ్ వాళ్లే వండుకుంటారు. చివరి ఎపిసోడ్ ఆ డైట్ వల్ల వచ్చిన రిజల్ట్ మీద ఫోకస్ చేసింది. స్పెసిఫిక్ డైట్ ప్లాన్ వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ నుంచి ప్రాణాలు తీసే వ్యాధుల వరకు ఎలాంటి ప్రభావం పడిందనే విషయం మీద ఫోకస్ చేశారు. వీగన్, ఓమ్నివోర్ డైట్ ప్లాన్లలో ఏది బెటర్ అని చెప్పడం కొసమెరుపు.
ఈ సిరీస్‌లో ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్ట్‌లు, చెఫ్ డేనియల్ హమ్ కనిపిస్తారు. ఈ చెఫ్ న్యూయార్క్‌లోని ‘ఎలెవన్ మాడిసన్ పార్క్’ ఓనర్. ఇక్కడ ప్లాంట్ బేస్డ్ మెను సర్వ్ చేస్తున్నారు. డేనియల్ 2018లో ‘ది గేమ్ చేంజర్స్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశాడు. ఈ సిరీస్ అథ్లెట్స్ అనుసరించే ప్లాంట్ బేస్డ్ డైట్ గురించి ఉంటుంది.
ఈ సిరీస్‌లో ... మీరు తీసుకునే ఆహారం మీ పూర్తి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చెప్తుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులు, ఆ మార్పులు మనం తినే ఆహారంతో నేరుగా సంబంధాన్ని ఎలా కలిగి ఉన్నాయనే విషయాలు తెలుస్తాయి. ఈ డాక్యు సిరీస్‌లో ‘చీజ్ ట్విన్స్’ అనే పార్ట్ చూస్తుంటే మనమే అందులో ఉన్న ఫీల్ కలుగుతుంది. దీన్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఈ నాలుగు భాగాల డాక్యు సిరీస్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ విడుదల చేసిన ఒక రీసెర్చి స్టడీ ఆధారంగా తీశారు.