ఎప్పుడూ దేశీ రుచులేనా.. అప్పుడప్పుడు ఇతరదేశాల రుచులూ చూడాలి. అసలే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అంటారు. మరి పొరుగు దేశాల్లో ఫుడ్ ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఈ వంటలు చదివి.. చేసుకుని తినాలి.
చికెన్ ఓవర్ రైస్
కావాల్సినవి :
చికెన్ బ్రెస్ట్ (బోన్‌లెస్, స్కిన్లెస్) - ఆరు ముక్కలు
నిమ్మరసం, పెరుగు, ఆలివ్ ఆయిల్ - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కాశ్మీరీ కారం - ఒక్కోటి అర టీస్పూన్
ఉల్లిగడ్డ పేస్ట్ లేదా ఆనియన్ పౌడర్, పసుపు - ఒక్కోటి పావు టీస్పూన్
కొత్తిమీర, జీలకర్ర - ఒక్కో టేబుల్ స్పూన్
ఉప్పు, నూనె - సరిపడా
మిరియాల పొడి, కారం, పార్స్లీ ఫ్లేక్స్ - ఒక్కోటీ టీస్పూన్
వెనిగర్, పసుపు - ఒక్కోటి రెండు టీస్పూన్లు
రైస్ కోసం
బియ్యం (నానబెట్టిన), నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఉల్లిగడ్డ - ఒకటి
జీలకర్ర, ఉప్పు, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
లవంగాలు - మూడు, యాలకులు - రెండు
చికెన్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఫుడ్ కలర్ లేదా పసుపు - పావు టీస్పూన్
వైట్ సాస్ కోసం :
పుల్లటి క్రీమ్ - అర కప్పు ; మయోనీస్ - ముప్పావు కప్పు
వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, మిరియాలు, పార్స్లీ ఫ్లేక్స్, కారం - ఒక్కోటి అర టీస్పూన్
చల్లటి నీళ్లు - రెండు టేబుల్ స్పూన్లు
టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు - రెండేసి చొప్పున
చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం లేదా వెనిగర్ - ఒక్కో టేబుల్ స్పూన్
ఉప్పు - ఒక టీస్పూన్
తయారీ : గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ఉల్లిగడ్డ పేస్ట్, కసూరీ మేతి, పెరుగు, నిమ్మరసం, వెనిగర్, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో చికెన్ ముక్కలు కూడా వేసి మరోసారి కలపాలి. మూతపెట్టి రెండు లేదా మూడు గంటలు పక్కనపెట్టాలి. ఆ తర్వాత గ్రిల్ పాన్ వేడి చేసి, నూనె పూసి చికెన్ ముక్కలు వేయాలి. రెండువైపులా బాగా కాల్చాక, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక గిన్నెలో వేయాలి.
ఆలివ్ ఆయిల్ వేడి చేసి, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు ఒక్కోటి వేగించాలి. ఆపై నానబెట్టిన బియ్యం వేయాలి. తర్వాత నీళ్లు పోసి కలపాలి. అందులో ఉప్పు, చికెన్ పౌడర్, జీలకర్ర, ఫుడ్ కలర్ లేదా పసుపు వేసి కలపాలి. మూతపెట్టి ఉడికించాలి.
ఒక గిన్నెలో పుల్లటి క్రీమ్, మయోనీస్, ఉప్పు, మిరియాలపొడి, పార్స్లీ ఫ్లేక్స్, వెనిగర్, నిమ్మరసం వేసి.. చల్లటి నీళ్లు పోసి బాగా కలపాలి.
మిక్సీజార్‌లో టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, వెనిగర్ వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ప్లేట్లో రైస్ వేసి దానిపై చికెన్ ముక్కలు, క్యాబేజీ, టొమాటో తరుగు, వైట్ సాస్, రెడ్ సాస్‌తో డెకరేట్ చేయాలి. ఇది న్యూయార్క్ స్పెషల్ డిష్.
తిరామిసు
కావాల్సినవి :
కాఫీ డికాషన్ - ఒకటిన్నర కప్పు
మాస్కర్పోన్ లేదా ఏదైనా చీజ్, క్రీమ్ కలిపిన మిశ్రమం - ఒక కప్పు
హెవీ విప్పింగ్ క్రీమ్ - ఒకటింబావు కప్పు
చక్కెర - అర కప్పు
లేడీ ఫింగర్ బిస్కెట్స్ - ఇరవై
వెనీలా ఎసెన్స్ - రెండు టీస్పూన్లు
కొకొవా పౌడర్ (స్వీట్ లేని) - ఒక టేబుల్ స్పూన్
తయారీ : ఒక గిన్నెలో మాస్కర్పోన్, ఒక కప్పు హెవీ విప్పింగ్ క్రీమ్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మరో గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు హెవీ విప్పింగ్ క్రీమ్, చక్కెర, వెనీలా ఎసెన్స్ వేసి క్రీమ్‌లా కలపాలి. అందులో మాస్కర్పోన్ మిశ్రమం కూడా వేసి మరోసారి కలపాలి. లోతుగా, వెడల్పుగా ఉండే ప్లేట్ లేదా గిన్నెకి వెన్న పూయాలి. లేదా బటర్ పేపర్ పెట్టి అందులో లేడీ ఫింగర్ బిస్కెట్స్ ఒక వరస పేర్చాలి. వాటి మీద కాఫీ డికాషన్ పోయాలి. దానిమీద తయారుచేసుకున్న క్రీమ్ మిశ్రమం వేయాలి. మరో లేయర్ లేడీ ఫింగర్ బిస్కెట్స్ పెట్టి, క్రీమ్ వేయాలి. దానిపై చాకొలెట్ పౌడర్ చల్లాలి. ఆ గిన్నెని మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. కావాలంటే చాకొలెట్ పౌడర్ ఫ్రిజ్‌లో నుంచి తీశాక కూడా చల్లుకోవచ్చు. ఇటలీ స్పెషల్ డెజర్ట్ ఇది.
కునాఫా
కావాల్సినవి :
సన్న సేమ్యా - అర కిలో
పాలు - అర లీటర్ ; నెయ్యి, చక్కెర, చీజ్ క్రీమ్ - పావు కిలో
పిస్తా (పొడి చేసి), మిల్క్ పౌడర్ - ఒక్కోటి 50 గ్రాములు
కార్న్‌ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్లు
చీజ్ - సరిపడా ; వెనీలా ఎసెన్స్, నిమ్మరసం - ఒక్కో టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో సేమ్యా, నెయ్యి వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి, వంద గ్రాములు చక్కెర వేసి కరిగించాలి. బాగా మరిగాక, నిమ్మరసం వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత వెనీలా ఎసెన్స్ లేదా రోజ్ వాటర్ కూడా వేయాలి.
పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆ పాలను పాన్‌లో పోసి, అందులో మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత మిగిలిన చక్కెర ఇందులో వేసి కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక చీజ్ క్రీమ్, చీజ్ తరుగు కూడా వేసి రెండు నిమిషాలపాటు బాగా కలుపుతూ ఉడికించాలి.
ఒక వెడల్పాటి ప్లేట్‌కి నెయ్యి పూసి, అందులో సేమ్యా వేయాలి. చిన్న గిన్నెతో గట్టిగా అదమాలి. దానిపై తయారుచేసిన క్రీమ్ వేయాలి. మళ్లీ దానిమీద సేమ్యా వేయాలి. స్టవ్ మీద చిల్లుల గరిటె లేదా రోస్టింగ్ పాన్ పెట్టి సన్న మంట మీద కునాఫాను ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, దానిపై చక్కెర కరిగించిన నీళ్లు పోయాలి. పిస్తా పొడి చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టర్కీ స్పెషల్ డిష్.
బ్లాక్ బీన్ వెజ్జీ స్మాష్ బర్గర్
కావాల్సినవి :
బ్లాక్ బీన్స్ - ఒక కప్పు
బ్రెడ్ పొడి - అర కప్పు
కార్న్ ఫ్లోర్ - పావు టీస్పూన్
ఉప్పు, మిరియాల పొడి - పావు టీస్పూన్
కోడిగుడ్డు - ఒకటి
నూనె - రెండు టీస్పూన్లుచీజ్, టొమాటో ముక్కలు, క్యాబేజీ తరుగు - సరిపడా
బర్గర్ బ్రెడ్ - రెండు స్లైస్‌లు
సాస్ కోసం : మయోనీస్, టొమాటో కెచెప్, మస్టర్డ్ సాస్, ఉల్లిగడ్డ తరుగు - ఒక్కో స్పూన్
కారం, వెల్లుల్లి పొడి - పావు టీస్పూన్
తయారీ : బ్లాక్ బీన్స్ శుభ్రంగా కడిగి వాటిని వేగించాలి. అవి పొడిగా అయ్యాక మిక్సీజార్‌లో వేయాలి. బ్రెడ్ క్రంబ్స్ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి, అందులో ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉండలు చేసి, గారెల్లా చేత్తో వత్తాలి. వాటిని సన్నని మంట మీద రెండు వైపులా కాల్చాలి. తర్వాత ఒక దానిపై చీజ్ వేసి దానిపై మరొకటి పెట్టాలి.
గిన్నెలో మయోనీస్, టొమాటో కెచెప్, మస్టర్డ్ సాస్, ఉల్లిగడ్డ తరుగు, కారం, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి. తర్వాత బర్గర్ బ్రెడ్లను నూనె లేకుండా కాల్చాలి. ఒకదానిపై సాస్ పూసి, టొమాటో ముక్కలు, క్యాబేజీ తరుగు పెట్టాలి. వాటిపై తయారుచేసుకున్న బీన్స్ స్లైస్‌లు పెట్టాలి. దానిపై మరోసారి సాస్ పూసి, మిగతా వెజిటబుల్స్ పెట్టి, పైన మరో బ్రెడ్ పెట్టాలి. ఇది లండన్ రెసిపీ.
సోఫ్రిటో
కావాల్సినవి :
ఉల్లిగడ్డ - ఒకటి ; క్యారెట్స్ - నాలుగు ; సెలరీ కాడలు - మూడు
నూనె - రెండు టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - రెండు
ఉప్పు, మిరియాల పొడి - చిటికెడు చొప్పున
టొమాటో సాస్ - రెండు కప్పులు
తయారీ :
ఉల్లిగడ్డ, క్యారెట్స్, సెలరీ కాడలు సన్నగా తరగాలి. నూనె వేడి చేసి, తరిగిన కూరగాయల్ని వేయాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా తరిగి అందులో వేయాలి. తర్వాత టొమాటో సాస్ వేసి బాగా ఉడికిస్తే.. ఇటాలియన్ ఫేమస్ సోఫ్రిటో రెడీ. అక్కడ అన్నిసార్లు వెజిటబుల్స్ అందుబాటులో ఉండవు. ఉన్నా వాటిని తరిగే టైం ఉండదు. కాబట్టి నిమిషాల్లో వంట చేయడం కోసం ముందుగానే పై మూడు ఇంగ్రెడియెంట్స్‌ని కట్ చేసి పెట్టుకుంటారట ఇటాలియన్లు. వాళ్లు చేసుకునే చాలా రకాల వంటల్లో బేస్ ఇంగ్రెడియెంట్స్ ఇవే.
కావాల్సినవి :
సన్న సేమ్యా - అర కిలో
పాలు - అర లీటర్ ; నెయ్యి, చక్కెర, చీజ్ క్రీమ్ - పావు కిలో
పిస్తా (పొడి చేసి), మిల్క్ పౌడర్ - ఒక్కోటి 50 గ్రాములు
కార్న్‌ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్లు
చీజ్ - సరిపడా ; వెనీలా ఎసెన్స్, నిమ్మరసం - ఒక్కో టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో సేమ్యా, నెయ్యి వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి, వంద గ్రాములు చక్కెర వేసి కరిగించాలి. బాగా మరిగాక, నిమ్మరసం వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత వెనీలా ఎసెన్స్ లేదా రోజ్ వాటర్ కూడా వేయాలి.
పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆ పాలను పాన్‌లో పోసి, అందులో మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత మిగిలిన చక్కెర ఇందులో వేసి కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక చీజ్ క్రీమ్, చీజ్ తరుగు కూడా వేసి రెండు నిమిషాలపాటు బాగా కలుపుతూ ఉడికించాలి.
ఒక వెడల్పాటి ప్లేట్‌కి నెయ్యి పూసి, అందులో సేమ్యా వేయాలి. చిన్న గిన్నెతో గట్టిగా అదమాలి. దానిపై తయారుచేసిన క్రీమ్ వేయాలి. మళ్లీ దానిమీద సేమ్యా వేయాలి. స్టవ్ మీద చిల్లుల గరిటె లేదా రోస్టింగ్ పాన్ పెట్టి సన్న మంట మీద కునాఫాను ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, దానిపై చక్కెర కరిగించిన నీళ్లు పోయాలి. పిస్తా పొడి చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టర్కీ స్పెషల్ డిష్.