సిరిసిల్ల నేతన్నలకు పంద్రాగస్ట్ గిరాకీ

  • 10 లక్షల జాతీయ జెండాల తయారీకి ఆర్డర్లు
  • 15 రోజులుగా చేతినిండా పనితో నేతన్నలు, మహిళా కార్మికులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పంద్రాగస్టును పురస్కరించుకొని సిరిసిల్లలో జాతీయ జెండాలను ఉత్పత్తి చేస్తూ నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. 15 రోజులుగా జెండాల తయారీలో కార్మికులు నిమగ్నమయ్యారు.  పంద్రాగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరంగా’ కార్యక్రమాలతో మన రాష్ట్రంతోపాటు, కర్నాటక, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల నుంచి జెండాల తయారీకి ఆర్డర్లు పెరిగినట్లు సిరిసిల్ల నేతన్నలు చెబుతున్నారు. 

ఈ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిరిసిల్లలో 10 మంది ఆసాములు జెండాల ఉత్పత్తిని ప్రారంభించడంతో 15 రోజులుగా నేతన్నలకు ఉపాధి లభిస్తోంది. రేపే పంద్రాగస్టు కావడంతో జెండాల ఉత్పత్తి చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షల జెండాలు ఎగుమతి చేసినట్లు  సేట్లు చెబుతున్నారు. 

15 రోజులుగా ఉపాధి 

సిరిసిల్ల నేతన్నలకు 15 రోజులుగా చేతినిండా పని దొరికింది. వస్త్రం తయారీ, జెండాల ఫోల్డింగ్ లో పని చేసే కార్మికులకు రోజూ రూ. 500 కూలీ గిడుతోంది. మహిళ కార్మికులు నేతన్నల వద్ద బట్ట తీసుకెళ్లి  కుట్టుమిషన్లతో ఇంటి వద్దే కుడుతున్నారు. ఒక్కోజెండాకు రూపాయి ఇస్తున్నారు. రోజుకు ఒక్కో మహిళా 3వేల జెండాలను కుడుతున్నారు. ఇలా దాదాపు 1200 మంది మహిళలు జెండాల తయారీలో ఉన్నారు. కాగా రాజీవ్ విద్యామిషన్ కింద ఇప్పటికే యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ఆర్డర్లు రాగా, ప్రస్తుత ఆర్డర్లతో రెండు నెలలుగా నేతన్నలకు ఉపాధి దొరుకుతోంది.