నీతి ఆయోగ్​ మీటింగ్​కు విపక్షాలు దూరం

  • బడ్జెట్​లో వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంల బాయ్​కాట్
  • రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని 
  • మీటింగ్​కు వెళ్లని తెలంగాణ సీఎం
  • తమకూ అన్యాయం జరిగిందంటూ కేరళ,
  • తమిళనాడు, కర్నాటక సీఎంల గైర్హాజరు​
  • వీరి బాటలోనే పంజాబ్, హిమాచల్​ప్రదేశ్​, జార్ఖండ్ ముఖ్యమంత్రులు
  • వెస్ట్ బెంగాల్ సీఎం మమత హాజరు.. మైక్ కట్ చేశారని వాకౌట్​

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేశాయి. ఈ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశానికి ప్రతిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్ష పాలిత రాష్ట్రాలకు చెందిన 8 మంది సీఎంలు దూరంగా ఉన్నారు. కేంద్ర బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లో వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్ష చూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డం, రాష్ట్రాల హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్కులు కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాన్ని నిరసిస్తూ ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బడ్జెట్ లో రాష్ట్రంపై వివక్ష చూపడాన్ని నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ఈ మీటింగ్  దూరంగా ఉన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశానికి హాజరు కాలేదు.  వీరితో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ర్ సింగ్ సుఖ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్  కూడా మీటింగ్ కు దూరంగా ఉన్నారు. 

ఢిల్లీ సీఎం అర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ద్యం పాలసీ కేసులో తీహార్ జైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లో ఉండడం వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ల్ల ఆయన కూడా హాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రుకాలేదు. కాగా దక్షిణాది నుంచి ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ లో పాల్గొనగా.. మరో కీలక భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ మీటింగ్ కు వెళ్లలేదు. ఆయన తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   చౌదరి, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   సిన్హా హాజరయ్యారు.  పుదుచ్చేరి సీఎం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  . రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్వామి కూడా హాజరుకాలేదు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ణ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ల్ల పాల్గొనలేదని రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్వామి చెప్పారు. 

మమతకు కాంగ్రెస్ మద్దతు 

నీతి ఆయోగ్​సమావేశంనుంచి వాకౌట్​ చేసిన మమతా బెనర్జీకి కాంగ్రెస్​ మద్దతుగా నిలిచింది. నీతి ఆయోగ్​ మీటింగ్​లో బెంగాల్​ సీఎం మమతా బెనర్జీపట్ల వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని తెలిపింది.  ఆమె మాట్లాడుతుండగా.. అన్యాయంగా మధ్యలో ప్రసంగాన్ని ఆపేశారని మండిపడింది. గత పదేండ్లనుంచి  ఈ సమావేశం అధ్యక్షత వహిస్తున్న ప్రధాని మోదీకి భజన చేసేందుకే నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

మమతది రాజకీయ డ్రామా: బీజేపీ

నీతి ఆయోగ్ సమావేశంనుంచి మమతా బెనర్జీ వాకౌట్​ చేయడాన్ని రాజకీయ డ్రామా అని బీజేపీ విమర్శించింది. ప్రతిపక్షాలకు చెందిన కొందరు బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   చేసేందుకు నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ను ఒక వేదికగా మార్చుకున్నారని పేర్కొన్నది. ఆమె అడ్మినిస్ట్రేటర్​గా కాకుండా.. తనకు తాను
ప్రతిపక్ష నాయకురాలిగా చిత్రీకరించుకున్నారని విమర్శించింది.

మమతకు మాట్లాడే అవకాశం ఇచ్చాం: నీతి ఆయోగ్ ​సీఈవో  

మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం వాస్తవం కాదని నీతి ఆయోగ్​సీఈవో బీవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. 

నాకు అవమానం జరిగింది: మమతా బెనర్జీ

నీతి ఆయోగ్​ సమావేశంలో తనకు అవమానం జరిగిందని పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లో పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పై వివక్ష చూపారని, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ మాట్లాడటం ప్రారంభించగానే వారు తన మైక్​ఆఫ్​ చేశారని తెలిపారు. నీతి ఆయోగ్​ సమావేశం నుంచి ఆమె వాకౌట్​ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు (కేంద్రం) రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపకూడదని చెప్పాను. నేను మాట్లాడాలని అనుకొంటే.. నా మైక్​ కట్​ చేశారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారు. నా ముందే చంద్రబాబునాయుడు 20 నిమిషాలు మాట్లాడారు.

 అస్సాం, గోవా, చత్తీస్​గఢ్​ సీఎంలు 10–20 నిమిషాలు మాట్లాడారు ” అని తెలిపారు. ప్రతిపక్షాలనుంచి తాను ఒక్కదాన్నే హాజరైనా.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇది చాలా అవమానకరమని అన్నారు. ఇది అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనని మండిపడ్డారు. అలాగే.. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   రాజకీయంగా ఉందని విమర్శించారు. ‘‘బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   విషయంలో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు’’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాను నీతి ఆయోగ్​సమావేశాలకు హాజరుకానని తేల్చి చెప్పారు.