OPPO F27 Pro + స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవిగో 

OPPO F27 Pro + స్మార్ట్ఫోన్  ఇండియాలో లాంచ్ అయింది. ప్రీ ఆర్డర్ లో భాగంగా అనేక ఆఫర్లను అందిస్తోంది. జూన్ 13 నుంచి జూన్ 19 వరకు ఈ ఆఫర్లను అంది స్తుంది. 6 నెలల వరకు యాక్సిడెంటల్ పగిలిపోవడం, నీటిలో పడిపోవడం వంటి డ్యామేజీలపై  రూ. 1199 ల విలువైన ప్రొటెక్షన్ ఆఫర్ ను అందిస్తుంది. 6 నెల ల పాటు ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా నో కాస్ట్ EMI సౌకర్యం, 9 నెలల వరకు లోన్స్ అందించబడుతాయి. HDFC, SBI, ICICI బ్యాంకులతో సహా ప్రముఖ బ్యాం కుల క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించబడుతుంది. OPPO F27 Pro+ 5G  స్మార్ట్ ఫోన్ జూన్ 20 నుంచి ఇండియాలో కొనుగోలు చేయొచ్చు . ఈ హ్యాండ్ సెట్ డస్క్ పింక్, మిడ్ నైట్ నేవీ రెండు కలర్లలో లభిస్తోంది. 

OPPO F27 Pro + స్మార్ట్ఫోన్  ఫీచర్లు: 

ఈ స్మార్ట్ ఫోన్ Octa Core Media Teck 7050 SoC, 8GB RAM, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 65 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో పాటు 6.7 అంగుళా 120Hz AMOLED డిస్ ప్లే తో వస్తుంది. ఎక్కువకాలం మన్నిక కోరుకునే స్మార్ట్ ఫోన్ యూజర్లకోసం, ప్రత్యేకంగా వర్షాకాలంలో మంచి పెర్మార్మెన్స్ కోసం  ఈ హ్యాండ్ సెట్ నుడిజైన్ చేశారు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Color OS 14 సిస్టమ్ పై పనిచేస్తుంది. 

కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్ సెట్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఈ హ్యాండ్ సెట్ IP66, IP68, IP69 రేటింగ్ పొందిన మొదటి స్మార్ట్ ఫోన్. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత, నీటి జెట్‌లు, నీటి ఇమ్మర్షన్‌ను 30 నిమిషాల వరకు తట్టుకునేలా రూపొందించబడింది.

ధర, వేరియంట్లు

8GB RAM, 128 GB తో ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 27,999
8GB RAM, 256GB తో ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 29,999

 ఈ హ్యాండ్ సెట్ ప్రారంభ ధర రూ. 32, 999 ఉంది.. దీనిపై 5వేల డిస్కౌంట్ ఒప్పో కంపెనీ..