IND vs AUS: ప్రాక్టీస్ లేకుండా పోయింది.. తొలి రోజు వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం

అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు నిరాశే మిగిలింది. శనివారం (నవంబర్ 30) మనుకా ఓవల్‌లో ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరగనున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా తొలిరోజు వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభ సమయానికి చిరు జల్లులు పడ్డాయి. అయితే ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. పింక్ బాల్ తో భారత్ కు ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని భావించినా అది జరగలేదు. 

ఆదివారం (డిసెంబర్ 1) మ్యాచ్ త్వరగా ప్రారంభం కానుంది. ఒకే రోజు కావడం వలన ఇరు జట్లకు 50 ఓవర్లు ఆడే అవకాశమిస్తారని బీసీసీఐ తమ ఎక్స్ ద్వారా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం రేపు (ఆదివారం) 9:10 గంటలను ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఉదయం 8:40 గంటలకే మొదలవుతుంది. 2020-21 ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా  అడిలైడ్‌ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ కు పింక్ బాల్ ను ఉపయోగించారు. 

ALSO READ : IND vs AUS: రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ ఔట్.. తుది జట్టులో ప్రమాదకర పేస్ బౌలర్

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారత్ తొలి టెస్ట్ భారీ విజయంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. భారత జట్టులో అడిలైడ్ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. యువ బ్యాటర్ గిల్ అందుబాటులో ఉండనున్నారు. ఇక ఆసీస్ జట్టులో ఈ మ్యాచ్ నుంచి ఫాస్ట్ బౌలర్ హేజల్ వుడ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)