ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ఓపెన్ AI కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.సామ్ ఆల్ట్ మెన్ ChartGPTలో సోరా టర్బో అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను తీసుకొచ్చారు. ఇదొక మల్టీ మోడల్ AI టెక్నాలజీ.. ఇది టెక్ట్స్ ను వీడియోగా మారుస్తుంది. ChatGPT Plus, ChatGPT Pro యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
AI మోడల్ Sora Turboఫీచర్లు
తన కస్టమర్లకు టెక్ట్స్, ఇమేజ్ లు, వీడియోల వినియోగం మరింతం సులభతరం చేసేందుకు కొత్త మోడల్ ను తీసుకొచ్చింది OpenAI. ఇది టెక్ట్స్ ను ఉపయోగించి 20 సెకండ్ల డ్యూరేషన్ గల 1080 పిక్సెల్ గల వీడియోలను పొందవచ్చు. అంతేకాకుండా వీడియో క్లిప్పింగ్ లో కొత్త ఫీచర్ రిమిక్స్ ఫీచర్ ను ఉపయోగించి క్లిప్స్ ను తొలగించవచ్చు. రీ ఇమాజిన్ చేయొచ్చు, రీప్లేస్ కూడా చేయొచ్చు.
ALSO READ | దూసుకుపోతున్న BSNL నెట్ వర్క్..కొత్తగా 55లక్షల మంది యూజర్లు
వినియోగదారులు తమ వీడియోల నుంచి 'స్టోరీబోర్డ్' ఫీచర్‌తో స్పెషల్ సీక్వెన్స్‌లను టైమ్‌లైన్‌లో రూపొందించవచ్చు, మార్పు చేయొచ్చు. ప్రస్తుతం ఓపెన్ AI కొత్త మోడల్ సోరా టర్బో సెలెక్ట్ చేయబడిన ఇండియా, కెనడా, జపాన్ లాంటి దేశాల్లో మాత్రమే ఎవైలేబుల్ గా ఉంది. ఇది టెక్ట్స్ నుంచి వీడియోలను త్వరితగతిన, ఆకట్టుకునేలా జనరేట్ చేస్తుంది.
AI మోడల్ సోరా టర్బోతో భద్రత, గోప్యత
AI మోడల్ సోరా టర్బోతో భద్రత, గోప్యత ఉంటుంది. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్, హానికరమైన డీప్ ఫేక్ కంటెంట్ ను అడ్డుకునేలా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తు్న్నారు.