టెక్నాలజి : చాట్​ జీపీటీతో సెర్చ్..

ఓపెన్​ ఏఐ సంస్థ.. చాట్​ జీపీటీ హోమ్​ పేజీలో కొత్తగా సెర్చ్ ఆప్షన్ ఫీచర్ కనిపించబోతోంది. అందులో క్రికెట్ స్కోర్, న్యూస్, స్టాక్స్ వంటి ఇన్ఫర్మేషన్​ను పొందొచ్చు. చాట్​ జీపీటీ.కామ్ వెబ్​సైట్​తో పాటు మొబైల్​ యాప్​లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం చాట్​జీపీటీ ప్లస్, టీమ్ యూజర్లు, సెర్చ్ జీపీటీ వెయిట్​ లిస్ట్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంటర్​ ప్రైజెస్, ఎడ్యుకేషనల్ యూజర్లు కొన్ని వారాల్లో ఈ సెర్చ్​ ఆప్షన్​ని వాడుకునే అవకాశం కల్పిస్తుంది. చాట్​జీపీటీని ఫ్రీగా వాడేవాళ్లకు కూడా మరికొన్ని నెలల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

చాట్​జీపీటీలో ఇప్పటివరకు ఏదైనా అడిగితే.. డేటాబేస్​లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించేది. ఇకపై ఏవైనా ప్రశ్నలు అడిగితే.. వెబ్​లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూడా అందించనుంది. దాని తర్వాత అడగబోయే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. క్లైమేట్, స్టాక్స్, స్పోర్ట్స్, న్యూస్, మ్యాప్స్ కోసం ఓపెన్ ఏఐ కంపెనీ.. ఫైనాన్షియల్ టైమ్స్, టైమ్ మ్యాగజైన్​, బిజినెస్ ఇన్​సైడర్​ వంటి కంపెనీలతో కలిసి పనిచేయనుంది.