ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్

  • 9 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్ 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్​ గురువారం రిలీజ్ అయింది. ఈ నెల 9 నుంచి 22 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. రూ.25 జరిమానాతో ఈ నెల 23 నుంచి 29 వరకు

Also Read :- పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు

రూ.50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు, తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ఆయన చెప్పారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. http://www.telanganaopenschool.org వెబ్ సైట్ ద్వారా లేదా టీజీ ఆన్ లైన్/మీ సేవా సెంటర్లలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.