టెక్నాలజీ : చాట్​జీపీటీలో కాన్వాస్​ టూల్ ఎలా పనిచేస్తుందంటే..

ఓపెన్ ఏఐ సంస్థ చాట్​జీపీటీలో ఇప్పుడు కొత్తగా ‘కాన్వాస్​’ అనే టూల్​ని తీసుకొచ్చింది. ఇది చాట్​జీపీటీలో రాయడం, కోడింగ్​ చేయడంలో సాయపడుతుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అసలు కాన్వాస్​ అంటే ఏంటి? ఎలా వాడాలో తెలుసుకుందాం. 

కాన్వాస్ అనేది చాట్​జీపీటీలో వచ్చిన కొత్త ఇంటర్​ఫేస్. ఇది ఏఐతో రాస్తుంది. కోడింగ్​ చేస్తుంది. ఇది ఓపెన్​ చేయగానే ఒక స్పెషల్ విండో ఓపెన్ అవుతుంది. యూజర్లు దీన్ని ఈజీగా వాడొచ్చు. ఇది రియల్ టైం ఎడిటింగ్, డీటెయిలింగ్ వంటివి మార్పులు చేస్తుంది. దీన్ని ‘యూజ్​ ది కాన్వాస్​’ అనే ఆప్షన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. కాన్వాస్​లో పైథాన్​ కోడ్, కస్టమ్ జీపీటీస్, రైటింగ్ అసిస్టెన్స్, కోడింగ్ టూల్స్ వంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు కాన్వాస్ ద్వారా పైథాన్ కోడ్​ చేసి, రియల్ టైం అవుట్​పుట్ పొందొచ్చు. 

అలాగే యూజర్లు తమ సొంత జీపీటీలను కాన్వాస్​కు జోడించి, చక్కగా పనిచేసుకోవచ్చు. దాంతోపాటు ఏఐ ద్వారా ఎడిటింగ్ సూచనలు, ఇన్​లైన్ ఫీడ్​ బ్యాక్, టోన్ అడ్జస్ట్​మెంట్ వంటివి చేయొచ్చు. ఇక చివరిగా కోడ్ రివ్యూ చూడొచ్చు. డీబగ్గింగ్ చేయొచ్చు. ఇతర కోడ్​లను మెరుగుపరచొచ్చు. అంతేనా.. కాన్వాస్​లో స్టోరీ బోర్డ్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే దానికి సంబంధించిన స్టోరీ బోర్డ్​ కాన్వాస్​లో క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.