Doctors Strike: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓపీ సేవలు.. రోగుల ఇబ్బందులు..

కోల్కతాలో జూనియర్ డాక్టర్  అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశశ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ ( ఆగస్టు 17, 2024 ) 24 గంటలపాటు వైద్య సేవల బంద్ చేయాలని నిర్ణయించాయి వైద్య సంఘాలు. అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు, సాధారణ OPDలు, శస్త్రచికిత్సలు శనివారం ( ఆగస్టు 17, 2024 ) ఉదయం 6 నుండి ఆదివారం ( ఆగస్టు 18, 2024 ) ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Also Read:-నన్ను జైల్లో పెట్టండి.. ఇంటికి మాత్రం వెళ్లను : భార్యా బాధిత సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేడుకోలు

 డాక్టర్లు కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే అటెండ్ అవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, మెడికల్ సిబ్బంది సైతం తమ సంఘీభావం ప్రకటించి ఓపీ సేవలను నిలిపివేశారు.ఈ క్రమంలో ఓపీ సేవలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నిరసన ద్వారా వైద్యులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు.వైద్యులకు కేంద్ర రక్షణ చట్టం అమలు చేయాలని,
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి తక్షణ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.సెక్యూరిటీ ఆడిట్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రిలో అమర్చిన కెమెరాల పూర్తి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు.