ఆన్ లైన్ షాపింగ్.. ఇది కూడా ఒక వ్యసనమే.. కష్టాలు తప్పవంట..

ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో  చిన్న వస్తువు నుంచి.. ఏసీ.. ఫ్రిజ్ టీవీ వరకు అంతా ఆన్ లైన్ షాపింగ్ పై నే ఆధారపడుతున్నారు.  ఇక కూరగాయలు.. పాల ప్యాకెట్ .. పిల్లలకు కావాల్సి న  అర్దరూపాయి.. చాక్లెట్ నుంచి... రూపాయి .. రెండు రూపాయిల బిస్కెట్ కూడా స్మార్ట్ ఫోన్.. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే చాలు..  కాలు బయట పెట్టడం లేదు.. ఈ తరం జనాలు.. అయితే ఇలా ప్రతి దానికి  ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడితే అది ఒక వ్యసనంగా మారడమే కాదు... కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. 

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు, ఇండియాకు అమెజాన్ పరిచయం కాకముందు ఏ వస్తువు కొనాలన్నా..మార్కెట్లో.. లేదంటే షాపులకు వెళ్లి కొనుక్కునే వారు. గతంలో అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇంట్లో అవసరం లేని వస్తువుల గురించి పట్టించుకునే వారు కాదు. అయితే అప్పుడు ఉండే షాపులు కూడా అలానే ఉండేవి.

సూపర్ మార్కెట్లు, డీమార్ట్‌‌లు రావడంతో పెద్దగా అవసరం లేని సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అప్పుడు సూపర్ మార్కెట్లలో అయినా కొంత నడిచేవారు.. ఒక్కోసారి  కొంతమంది కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడేవి.   ఇప్పుడు జనాలు ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడి...నడక లేదు.. ఏమీ లేదు..  చేతిలో ఫోన్ పట్టు... ఆన్ లైన్ డబ్బులు కట్టు... పార్శిల్ పట్టు.. ఇబ్బందులు పడు ..అన్నట్టుగా తయారయ్యారు. 

 స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్ లో ఇష్టం వచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. పదే పదే ఆన్‌లైన్ షాపింగ్ చేయడం కూడా సరికాదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఆన్లైన్ షాపింగ్ అడిక్షన్, కంపల్సివ్ బయింగ్‌ డిజార్డర్ లేదా ఒమియో మానియా అంటారు. ఆన్ లైన్ షాపింగ్ తరుచూ చేయడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో పాటు రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ తక్షణ ఆనందం ఇస్తుంది. కాబట్టి ఇది ఒక వ్యసనంగా మారుతోంది. 

డెలివరీ ప్యాకేజ్‌లు ఓపెన్ చేసినప్పుడు డోపమైన్ అనే ఒక రసాయనాన్ని విడుదల అవుతుందని...  దీంతో మరింత షాపింగ్ చేయాలనే ఫీలింగ్ కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా డోపమైన్ ప్లేజర్ కెమికల్ మాదకద్రవ్య దుర్వినియోగం లాంటి వ్యసనాన్ని సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు. 

షాపింగ్ అడిక్ట్

షాపింగ్ కోసం ఈజీ యాక్సిస్ ఉండడం వల్ల మన ఖర్చులు పెరుగుతున్నాయి. సేల్స్ యాడ్స్ కూడా షాపింగ్ ఎక్కువ చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. అయితే ఆత్మనూన్యతతో బాధపడేవారు షాపింగ్ ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంటుందట. ఒత్తిడి, నిరాశ, ఆందోళన లేదా ఒంటరితనం ఎదుర్కునేందుకు వారు షాపింగ్ ఎక్కువగా చేస్తారు. ఆన్ లైన్ షాపింగ్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఆందోళన, ఆర్థిక సమస్యలు, డిప్రెషన్‌కు కారణమవుతుంది. ఇది తాత్కాలికంగా తృప్తినిచ్చినా..కానీ తర్వాత వ్యసనంగా మారి సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది.

ఎలా మార్చుకోవాలి:

ముందుగా మనకు ఎందుకు షాపింగ్ చేయాలని అనిపిస్తుందో తెలుసుకోవాలి. దాని నుంచి బయటపడేందుకు స్నేహితులతో మాట్లాడడం లేదంటే వ్యాయామం చేయడం, ఏదైనా పని చేయడం వంటివి చేయాలి. ఒక బడ్జెట్ పెట్టుకుని అందులోనే షాపింగ్ చేయండి. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఫోన్లో నుంచి షాపింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. షాపింగ్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేందుకు కొత్త అలవాట్లు, వివిధ రకాల యాక్టివిటీస్ ఫాలో అవ్వాలి. అవసరమైతే మానసిక సమస్యలను పరిష్కరించుకునేందుకు నిపుణులను కలవడం మంచిదిఅంతే కాకుండా మీ ఖర్చులను రెగ్యులర్ గా ట్రాక్ చేయండి. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన ప్రమోషన్స్, ఇమెయిల్ అన్ సబ్‌స్క్రైబ్ చేయండి.