ఆన్లైన్ స్కామ్‌లు ఇప్పుడు ఇ–మెయిల్స్, మెసేజ్‌లు ద్వారా కూడా జరుగుతున్నాయి. వాటి బారిన పడకుండా ఉండేందుకు గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దానిపేరు.. గూగుల్ మెసేజ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ యూజర్లు ఈ ఫీచర్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు.
మెసేజ్‌ల్లో ‘రిపోర్ట్ స్పామ్’ లేదా ‘రిపోర్ట్ నాట్ స్పామ్’ అనే హెచ్చరిక కనిపిస్తుంది. దాన్ని బట్టి యూజర్లే వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. డివైజ్‌లోని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ రిపోర్ట్ చేయకపోతే మెసేజ్ కంటెంట్ షేర్ చేయకుండా స్పామ్ ప్యాటర్న్స్ గుర్తిస్తాయి. అంతేకాదు.. గూగుల్ ఇ–మెయిల్ మెసేజ్‌లను స్పామ్ ఫోల్డర్లో హైడ్ చేయొచ్చు.
ఈ స్పామ్ డిటెక్షన్ ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. స్పామ్ ప్రొటెక్షన్ మెరుగుపరచడానికి అన్నోన్ డాటాను గూగుల్‌కు పంపుతుంది. గూగుల్ సెలక్ట్ చేసిన మెసేజ్ డిటెయిల్స్‌ను టెంపరరీగా స్టోర్ చేస్తుంది. కానీ, పేర్లు లేదా ఫోన్ నెంబర్ల వంటి వాటిని నివారిస్తుంది. స్పామ్ గుర్తించేటప్పుడు యూజర్ ప్రైవసీని నిర్ధారిస్తుంది.
ఇలా వాడాలి
గూగుల్ మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో స్పామ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. టోగుల్‌ని ఎనేబుల్ చేయాలి. దాంతో గూగుల్ మెసేజ్‌ల కోసం స్పామ్ ప్రొటెక్షన్ ఆన్ చేస్తుంది. యాప్ ఆటోమెటిక్‌గా మెసేజ్‌లను ఫిల్టర్ చేస్తుంది. యూజర్ల నుంచి మాన్యువల్ ఇన్పుట్ అవసరం లేదు. అయితే, ఏదైనా మెసేజ్‌ని యూజర్లు మాన్యువల్‌గా స్పామ్ అని రిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
పిన్ చేస్తే సరి!
వాట్సాప్ గ్రూపులో ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌లు కూడా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే. అలాంటి వాటిని ‘పిన్’ చేసుకుంటే ఒకసారి చూసిన వాటిని మళ్లీ చూడడం ఈజీ అవుతుంది. దీని ద్వారా టెక్స్ట్ మెసేజ్, వీడియోలు, పోల్స్, ఫొటోలు... ఇలా వాట్సాప్‌కు వచ్చే అన్ని మెసేజ్‌లు పిన్ చేసుకోవచ్చు. పిన్ చేసిన మెసేజ్‌లు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాయి. కావాలనుకుంటే 24 గంటలు, 30 రోజులు అవి ఉండేలా సెట్ చేసుకోవచ్చు.
టైం అయిపోయాక పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ మెంబర్స్‌కి మెసేజ్‌లు పిన్ చేసి పంపడం అడ్మిన్‌కి మాత్రమే సాధ్యం. యూజర్లు మెసేజ్‌లను పిన్ చేయాలంటే, పిన్ చేయాలనుకున్న మెసేజ్‌ను హోల్డ్ చేయాలి. తర్వాత మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేసి, ‘పిన్’ ఎంచుకోవాలి. తర్వాత టైం పీరియడ్ సెలక్ట్ చేయాలి. ఒకవేళ అన్ పిన్ చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ యూజర్లు మెసేజ్‌పై హోల్డ్ చేసి అన్ పిన్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఐఫోన్ యూజర్లు మోర్ ఆప్షన్‌కి వెళ్లి అన్ పిన్ చేయొచ్చు.