Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!

వంట.. ఫుడ్.. ఎంత కష్టపడి చేసినా.. నిమిషాల్లో ఖాళీ.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలా వండుకోవటం.. తినటం.. కడుక్కోవటం.. ఎంత కష్టమో కదా.. అందుకే ఫటాఫట్.. నిమిషాల్లో రెడీ అయిపోయే ఓ టేస్టీ పచ్చడిని పరిచయం చేస్తున్నాం.. అదే ఉల్లిపాయల పచ్చడి.. చాలా సింపుల్.. ఇలా చేస్తే 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. 

ఉల్లి పచ్చడికి కావాల్సినవి :

ఉల్లిగడ్డలు పెద్దవి నాలుగు
ఎండుమిర్చి.. ఘాటుగా ఉండేవి ఆరు తీసుకోండి
వెల్లుల్లి ఆరు తీసుకోండి
చింతపండు కొద్దిగా.. 
ఉప్పు తగినంత
ఆవాలు 2 టీ స్పూన్స్
జీలకర్ర 2 టీ స్పూన్స్
మెంతులు టీ స్పూన్ లో సగం
పసుపు తగినంత
నూనె 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు 6 రెబ్బలు

ఇక తయారీ ఎలానో తెలుసుకుందామా :

ఉల్లిగడ్డలను ముక్కలుగా తరగాలి. ఎండుమిర్చిని తుంచాలి. వెల్లుల్లి చిదమాలి. చింతపండులో నీళ్లుపోసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు.. ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, నానబెట్టిన చింతపండును మిక్సీలో వేయాలి. పేస్ట్ లా మెత్తగా చేసుకోవాలి. 

ALSO READ | Good Health : పొద్దు తిరుగుడు గింజలు తింటున్నారు.. నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా..?

ఆ తర్వాత కడాయిలో నూనె వేయాలి. పైన తీసుకున్న అన్నింటినీ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చట్నీలో కలుపుకోవాలి. అంతే ఉల్లి పచ్చడి రెడీ.. 

ఈ చట్నీలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ లో తినొచ్చు.. చక్కగా అన్నంలో కలుపుకుని తినొచ్చు.. ఫటాఫట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఉల్లి పచ్చడి..