OnePlus Nord 3: రూ.33వేల స్మార్ట్ ఫోన్ రూ. 20వేలకే

OnePlus తన కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus Nord 4చేసేందుకు సిద్దమవుతోంది. దీనికంటే ముందు గతేడాది రిలీజ్ చేసి OnePlus Nord 3 5 G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు  ప్రకటించింది. ఈ హ్యాండ్ సెట్ పై ఈ- కామర్స్ ఫ్లాట్ ఫాం అమెజాన్ లో  వేలల్లో డిస్కౌంట్ అందిస్తోంది. కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్ లను కూడా ఇస్తుంది.  

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ గతేడాది 33వేల 999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ హ్యాండ్ సెట్ లపై పై 20వేల డిస్కౌంట్ అందిస్తోంది. 8GB RAM, 128 GB స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ 20వేల 999 రూపాయలకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లతో మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. అంటే 13వేల డిస్కౌంట్ లభిస్తోంది. మొత్తంగా  ఈ స్మార్ట్ ఫోన్ 19వేల 999 ను కొనుగోలు చేయొచ్చు. 

OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు 

ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల 1.5K AMOLED డిస్ ప్లే తో వస్తోంది. 120 Hzరిఫ్రెష్  రేట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ హ్యాండ్ సెట్ లో MediaTek Dimensity 9000 ప్రాసెసర్, 16GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్  తో రన్ అవుతుంది. 

 ఈ స్మార్ట్ ఫోన్ Oxygen OS బేస్డ్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ తో పనిచేస్తుంది. దీనిని ఆండ్రాయిడ్ 14 కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది 5000mAh  బ్యాటరీ, 80W  ఛార్జింగ్ సపోర్ట్ చేసే C ఛార్జర్ తో కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఫోటగ్రఫీ, వీడియోలు, వాట్సాప్ కాల్స్ కోసం ఇందులో ట్రిపుల్ కెమెరా ను కలిగిఉంటుంది.