కోరుట్ల యాక్సిడెంట్​లో ఒకరికి గాయాలు

కోరుట్ల,వెలుగు :  పట్టణంలోని కొత్త బస్టాండ్​ ఇన్​గేట్​ వద్ద  శుక్రవారం  జరిగిన యాక్సిడెంట్​లో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుడు  ప్రశాంత్​ తెలిపిన వివరాల ప్రకారం..   ప్రశాంత్​  తన మారుతి సుజుకీ వ్యాన్​లో కామారెడ్డి నుంచి మేడిపల్లి పని మీద బయల్దేరాడు. మార్గ మధ్యలో  కోరుట్ల కొత్త బస్టాండ్​ ఇన్​గేట్ వద్దకు​ రాగానే జగిత్యాల  నుంచి నిజామాబాద్​ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు..  బస్టాండ్​ ఇన్​గేట్​ లోపలికి వెళ్తున్న క్రమంలో  వ్యాన్​, బస్సు  ఢీకొన్నాయి. వ్యాన్​ డ్యామేజీ కాగా, డ్రైవర్​ ప్రశాంత్ కు  గాయాలయ్యాయి.