హిందూమతంలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.. గ్రహణాలకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో కనపడితే మాత్రం చాలా మంది కచ్చితంగా గ్రహణ నియమాలను పాటిస్తూ ఉంటారు.. సూతక కాలంలో కనీసం ఆహారం కూడా తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇలా చాలా నియమాలు పాటిస్తారు. 2024 వ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతాయి. వాటిలో రెండు సూర్యగ్రహణాలు... రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతాయి.. ఈ గ్రహణాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి.. ఎప్పుడు ... ఏప్రాంతంలో కనిపిస్తాయో తెలుసుకుందాం. . .
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి
మొదటి సూర్య గ్రహణం
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా, 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది.
ఈ సూర్యగ్రహణం సూత కాలం- నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధృవంలో 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.
రెండవ సూర్య గ్రహణం
2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2, 3 రాత్రి జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం, 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9:13 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 3 తెల్లవారుజామున 3:17 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా రెండవ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది.
2024 సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కూడా కనిపించదు. కాబట్టి, ఈ సూర్యగ్రహణం సూత కాలం కూడా భారతదేశంలో పరిగణలోకి రాదు
తొలి చంద్రగ్రహణం
2024లో పెనుంబ్రా( పాక్షిక) చంద్రగ్రహణం మార్చి 25 తేదీన వస్తుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఉదయం 10.41 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.01 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు కొనసాగనుంది. అదే రోజు హోలీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. 2024 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 36 నిమిషాలు ఉంటుంది.
ఈ చంద్ర గ్రహణం సూత కాలం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. 2024 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు.
రెండో చంద్ర గ్రహణం
18 సెప్టెంబర్ 2024లో రెండవది, చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు.భారత కాలమానం ప్రకారం ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటల వరకు కొనసాగుతుంది. 2024 సంవత్సరంలో రెండో చంద్ర గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 04 నిమిషాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం కూడా భారత్‌లో కనిపించదు.
యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. భారత్ లో ఉండకపోవడం వల్ల సుతక్ కాలం పాటించాల్సిన అవసరం లేదు. 2024వ సంవత్సరంలో ఏర్పడే రెండు సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాల ప్రభావం భారత్ మీద ఏ మాత్రం ఉండవు.