దండం పెడతాం : ఆమ్లేట్ పై బిస్కెట్లు.. ఇదేం టేస్ట్ బాబూ

అనేక ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్, చిరుతిళ్లు కొన్ని వినూత్న ప్రయోగాలతో ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు, ఇతర చెఫ్‌లు ప్లేట్‌లో ప్రత్యేకమైనదాన్ని అందించడానికి తరచుగా కొత్త కొత్త ఐడియాలను అమలు చేస్తుండడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని పూర్తిగా నోరూరించేవిగా మారితే, మరికొన్ని ప్రజలకు ఆకట్టుకునే విషయంలో ఆమడంత దూరంలో మిగిలిపోయాయి. ఇటీవల, ఒక వీధి వ్యాపారి ఆమ్లెట్, గుడ్లు, పార్లే-జి బిస్కెట్లతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ న్యూ ఫ్యూజన్ ఇంటర్నెట్‌లో "మోయే మోయే ఆమ్లెట్"గా సూచించబడుతోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయినప్పటికీ, ఈ అసాధారణ వంటకానికి నెటిజన్లు అంత పెద్దగా ఆట్రాక్ట్ కాలేదు.

ఈ చిన్న వైరల్ వీడియోను ఫుడ్ వ్లాగింగ్ పేజీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇది మొదట్నుంచి వంటకం తయారీని చూపుతుంది. ముందుగా విక్రేత రెండు గుడ్లను మిక్సింగ్ గిన్నెలోకి పగలగొట్టి.. ఆపై సన్నగా ముక్కలు చేసిన ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు పొడి అందులో వేశాడు. ఆ తర్వాత గుడ్డు మిశ్రమాన్ని వెన్న పూసిన పాన్‌పై ఉంచి, దాన్ని సమానంగా వేశాడు. ఇది ఆమ్లెట్ లాగా కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ ఓ ట్విస్ట్ కనిపిస్తుంది. అతను పార్లే-జి బిస్కెట్ ప్యాక్‌ని తీసుకుని, గుడ్డు పై పొరను పూర్తిగా కప్పి ఉంచి ఆమ్లెట్ పైన జాగ్రత్తగా ఉంచాడు. ఆపై లేయర్ లో జున్ను వైశాడు. ఆలా దాన్ని కరిగించి.. చివరగా, అతను ఆమ్లెట్‌ను మడిచి, పార్లే-G ప్యాక్, కొన్ని సాస్‌లతో ఈ ఒక రకమైన భోజన కలయికను అందించాడు.

అప్‌లోడ్ చేసినప్పటి నుండి, ఈ వీడియో ఇప్పటివరకు 13.8 మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది. దీనికి కొందరు ఆమ్లెట్ కు నివాళులు తెలియజేస్తూ చమత్కారంగా కామెంట్లు పెట్టారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @foodb_unk