కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం సేవాళాల్ తండాలో పిట్ల రాజ్యలక్మి (75) అనే వృద్ధురాలు పై కుక్కలు కిరాతకంగా దాడి చేశాయి. కుక్కలు రాజ్యలక్ష్మి తల, కడుపు భాగం పూర్తిగా తినేసాయి. కుక్కలు రాత్రి దాడి చేసి చంపగా... ఆమె కొడుకులు తెల్లవారి ఉదయం 9గంటలకు చూశారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.

ఇంటికి తలుపులు లేకపోవడంతో దాడి చేసి ఉండవచ్చని గ్రామస్తులు అంటున్నారు.వృద్ధురాలిపై దాడి చేసిన కుక్కను గ్రామస్తులు చంపేశారు. గతంలో చిన్నపిల్లపై కూడా కుక్కలు దాడి చేశాయని, కుక్కలా బెడద నుండి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.