Diwali 2023: దీపావళి పండుగలో పాత తరం సాంప్రదాయాలు ఇవే..

Diwali 2023: గోంగూర కర్రలతో దివిటీలు కొట్టించేవారు.ఇంటి ముందు నిలబెట్టి దివిటీలు అంటే గోంగూర కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిలాంటి బట్టను కట్టి. వెలిగిస్తారు.

దీపావళికి ( Diwali) కొత్త తరం ఒకలా ..పాత తరం మరోలా చేసుకుంటున్నారు. అంతే కాదు ఇప్పుడు ఉన్న వారికి కొన్ని సాంప్రదాయాలు తెలీక కొన్ని అయితే ..మరి కొన్ని అందుబాటులో లేక అలా కొన్ని ఆచారాలను మరిచిపోయారు. దీపావళి రోజు చిన్నపిల్లలకు గోంగూర (gongura) కర్రలతో దివిటీలు కొట్టించేవారు.ఇంటి ముందు నిలబెట్టి దివిటీలు అంటే గోంగూర కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిలాంటి బట్టను కట్టి..దాన్ని దీపంతో వెలిగించి..కాసేపు అలా ఉంచుతారు. చంటిపిల్లలకైతే గోంగూర కర్రలు కాకుండా చెరుకు గడ ముక్కలకు ఒత్తిలు కట్టించి కొట్టిస్తారు. ఆముదం కర్రలు కూడా వాడతారు.పిల్లలను వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలు వెలిగించి ఆకాశంలో దక్షిణ వైపు చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. 

దివిటీలు కొట్టేటప్పుడు

“దిబ్బూ దిబ్బూ దీపావళి … మళ్ళీ వచ్చే నాగుల చవితి…. 
పుట్ట మీద పొట్ట జొన్న కర్ర..హూత్ బెల్లంముక్క..
 దిబ్బు దిబ్బు దీపావళీ బలుసు చెట్టు మీద పెద్దలారా దిగిరండి

అంటూ పిల్లలతో పాడిస్తు నేలమీద గోంగూర కర్రలతో కొట్టిస్తారు.. దివిటీలు కొట్టటం పూర్తి అయ్యాక..ఆ తర్వాత ఆ కాడలను ఒక పక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి తుడిచి నోరు శుభ్రం చేయించి మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంట్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజున దివిటీలు కొట్టించిన తరువాత..వారికి నోరు , కాళ్లు , చేతులు , కడిగి అప్పుడు స్వీట్ తినిపించాలి. 

శీతాకాలంలో చలికి శరీరం చల్లదనానికి గురవుతుంది.దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సమస్యలు శీతాకాలంలో( winter) వస్తాయి. శరీరంలో వేడి తగ్గటం వల్ల వచ్చే వ్యాధులకు గోంగూర చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. గోంగూర కాడలు కాలడంతో వచ్చే...పొగ పర్యవరణానికి చాలా మంచిది . అప్పటి సాంప్రదాయాలు ఇప్పుడు పాటించడం లేదు. కారణం కంఫర్ట్ . పెద్దలు చెప్పినట్లు కాదు ..ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేసుకుంటున్నారు.