యాదగిరీశుడికి రూ. 2.98 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వార భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. 42 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. 

ఇందులో రూ.2,98,48,233, బంగారం 205 గ్రాములు, వెండి 5.710 కిలోలు వచ్చిందని ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. అలాగే హుండీలలో అమెరికా,  యూఏఈ,  యూరోప్,  నేపాల్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు దేశాలకు కరెన్సీ భారీ మొత్తం వచ్చింది.