నాగార్జున సాగర్ ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత

హాలియా: ఎగువన శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు24 గేట్లను ఎత్తి 2,18,300 క్యూ సెక్కుల  నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్‌ రిజర్వాయర్  ఎగువ నుంచి 2,60,488  క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో కిందికి విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6  గంటల వరకు సాగర్‌ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312 టీఎంసీ)లకుగాను 588. 70 అడుగులుగా నమోదైంది. కుడి కాల్వ ద్వారా 8,604 , ఎడమ కాల్వ ద్వారా 2,114, విద్యుత్​ఉత్పత్తికి 29,070 , ఎస్‌ఎల్‌బీసీకి1,800, వరదకాల్వకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. 

పర్యాటకుల సందడి..

 సాగర్ గేట్ల ఎత్తివేతతో చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి  కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ మైమరచిపోయారు. బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్, పవర్ హౌస్, ఎత్తిపోతల, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జి తదితర ప్రదేశాల్లో పర్యాటకులు సందడి చేశారు.