కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్లకు తగులుతున్నాయని చెట్ల నరికివేత

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ఓ వైపు పచ్చదనం పెంచాలని ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలుచేస్తున్నాయి. ప్రభుత్వాల శాఖల మధ్య సమన్వయ లోపంతో పెరిగిన చెట్లను నరుకుతున్నారు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వేంపేట, వెల్లుల్ల గ్రామాలతోపాటు, ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాలుగేండ్ల కింద మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారాయి.

కాగా కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్లకు అడ్డుగా వస్తున్నాయని వేంపేట శివారులోని రోడ్డుకిరువైపులా ఉన్న 150 చెట్లతోపాటు, వెల్లుల్ల గ్రామంలోని చెట్లను ఆ శాఖ అధికారులు నరికేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తాము నరకలేదని సమీప రైతులే తొలగించారని సమాధానమిచ్చారు. చెట్ల నరికివేతపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎంపీడీవో, జీపీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.