కొండగట్టు హుండీ ఆదాయం రూ. 81 లక్షలు

కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ హుండీని శుక్రవారం అధికారులు  లెక్కించారు.  రూ. 81,07, 641 నగదు వచ్చినట్టు,14 గ్రాముల బంగారం, 4.9 కిలోల వెండి, 61 విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించినట్టు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.

 56 రోజుల తర్వాత 12 హుండీలను లెక్కించామన్నారు. ఎండోమెంట్అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఏఈఓ అంజయ్య, సిబ్బంది ఉన్నారు.