చెట్లు నరికివేసిన వారిపై చర్యలు 

లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్‌‌లో అక్రమంగా చెట్లను నరికి వేస్తున్నారంటూ ‘ఆగని చెట్ల కూల్చివేత’ అనే వెలుగులో కథనం ప్రచురితం కాగా.. ఫారెస్టు ఆఫీసర్లు స్పందించారు. ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఓంకార్, మెంగారం బీట్ ఆఫీసర్ పర్వీన్, సెక్షన్ ఆఫీసర్ సలీం బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి బోనాల్ అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.

చెట్లు నరికివేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. బానాపూర్ బీట్ పరిధిలోని ప్లాంటేషన్ లో అక్రమంగా సాగవుతున్న మొక్కజొన్న పంటను పరిశీలించి బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.