భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలం జంగంపల్లి, కాచాపూర్ బీబీపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట, రాజంపేట మండలం తలమడ్ల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లను కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు రైతులతో మాట్లాడారు.
ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఎంత పెట్టుబడి పెట్టారు. ఎంత నష్టం వాటిల్లిందని అడిగి తెలుసుకున్నారు.పంట నష్టం వివరాలను సేకరించారు. కొనుగోలు సెంటర్ల సీఈవోలతో మాట్లాడారు. ధాన్యం తూకం ఎలా వేస్తున్నారని, ఇప్పటి వరకు ఎంత మేర కొనుగోలు చేశారని తెలుసుకున్నారు. బృందం సభ్యులతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మల్లికార్జున్, జిల్లా ఇంచార్జ్ మేనేజర్ నిత్యానందం, సింగిల్విండో సీఈవోలు, రైతులు ఉన్నారు.