తొలి వన్డేలో కివీస్ గెలుపు.. 9 వికెట్ల తేడాతో ఓడిన శ్రీలంక

వెల్లింగ్టన్‌‌: మ్యాట్ హెన్రీ (4/19) సూపర్ బౌలింగ్‌‌కు తోడు ఓపెనర్‌‌‌‌ విల్‌‌ యంగ్‌‌ (90 నాటౌట్‌‌)  సత్తా చాటడంతో శ్రీలంకతో తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ పోరులో తొలుత లంక 43.4 ఓవర్లలో 178 రన్స్‌‌కే ఆలౌటైంది. అవిష్క ఫెర్నాండో (56) ఫిఫ్టీతో మెరిశాడు. 

డఫీ, నేథన్‌‌ స్మిత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం కివీస్ 26.2 ఓవర్లలోనే 180/1 స్కోరు చేసి గెలిచింది. యంగ్‌‌తో పాటు రచిన్ రవీంద్ర (45), మార్క్ చాప్‌‌మన్ (29) ఆకట్టుకున్నారు. హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్‌‌లో బుధవారం జరుగుతుంది